3డి చిత్రం ‘అజయంతే రందం మోషణం’ ప్రారంభం

స్టార్ హీరో టొవినో థామస్ తన కెరీర్‌లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘అజయంతే రందం మోషణం’. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. మూడు యుగాల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టోవినో మూడు పాత్రల్లో కనిపించనున్నారు. టైటిల్ క్యారెక్టర్స్ మణియన్, అజయన్, కుంజికే పాత్రలు పోషించనున్నారు. సుజిత్ నంబియార్ ఈ చిత్రానికి కథ , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

‘అజయంతే  రందం మోషణం పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రం 3డిలో విడుదల కానుంది. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ , సురభి లక్ష్మి కథానాయికలుగా నటిస్తున్నారు. సౌత్ ఇండియన్ సెన్సేషన్ కృతి శెట్టికి ఇది మొదటి మలయాళ చిత్రం. బాసిల్ జోసెఫ్, కిషోర్, హరీష్ ఉత్తమన్, హరీష్ పేరడి, జగదీష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యూజీఎం ప్రొడక్షన్స్‌ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేజిక్ ఫ్రేమ్స్ కూడా నిర్మాణంలో పాలుపంచుకోనుంది. ఈ సినిమా కథలో కేరళలోని కలరి అనే మార్షల్ ఆర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యత వుంది. ఈ చిత్రానికి తమిళ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ దీపు నైనాన్ థామస్ సంగీత  అందిస్తున్నారు. ఈ సినిమాలో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నందున టోవినో ఇటీవల కలరి విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

ప్రొడక్షన్ డిజైనర్- గోకుల్ దాస్
కాస్ట్యూమ్ డిజైనర్ – ప్రవీణ్ వర్మ
మేకప్ – రోనెక్స్ జేవియర్
ప్రొడక్షన్ కంట్రోలర్ – బాదుషా
ఎడిటింగ్ – షమీర్ మహ్మద్
ఛాయాగ్రహణం – జోమోన్ టి జాన్
పీఆర్వో – వంశీ- శేఖర్

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago