గ్రాండ్ గా జరిగిన 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు..  

Must Read

గ్రాండ్ గా జరిగిన 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ కు ఘన సన్మానం  

తెలుగు సినిమాటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ ఎస్ గోపాల్ రెడ్డి ( లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్), ఛోటా కె. నాయుడు, కె కె సెంథిల్ కుమార్, శరత్, కె రవీంద్రబాబు, సి రామ్ ప్రసాద్, హరి అనుమోలు, రసూల్ ఎల్లోర్ లను ఘనంగా సత్కరించారు. యువ సినిమాటోగ్రాఫర్స్ కార్తిక్ ఘట్టమనేని, ఉదయ్ గుర్రాలని సినిమాటిక్ విజనరీ అవార్డ్స్, సాయి శ్రీరామ్, దాశరధి శివేంద్ర, నగేష్ బ్యానల్, బాల్రెడ్డి, సినిమాటిక్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ తో సత్కరించారు. ఈ వేడుకలో దర్శకులు కోదండరామి రెడ్డి, వివి వినాయక్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి, సాయి రాజేష్, దామోదర్ ప్రసాద్, రాధకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకలో ఎస్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమలో 55 ఏళ్ళు పూర్తి చేసుకున్నాను. 1968లో చెన్నై వీనస్ స్టూడియోలో అప్రంటీస్ గా చేరాను. అంచెలంచెలుగా సినిమాటోగ్రఫర్ అయ్యాను. ఇప్పటికి యాభై ఐదేళ్ళు అయ్యాయి. ఈ రోజు నా మిత్రులందరి ముందు ఈ సత్కారం  తీసుకోవడం చాలా ఆనందంగా వుంది. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.  

ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ.. ఎస్ గోపాల్ రెడ్డి గారిని చూసి ఆయనలా మంచి కెమరామేన్ కావాలని స్ఫూర్తి పొందాను. మన తెలుగులోనే ది బెస్ట్ కెమరామెన్స్ వస్తున్నారు. సరైన అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారు. ఇండియన్ సినిమాని తెలుగు కెమరామెన్ రూల్ చేస్తారనే నమ్మకం వుంది. దీన్ని సవాల్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలి’’ అన్నారు.

సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. కెమరామెన్స్ అందరినీ ఇలా ఒక్కచోట చూడటం ఆనందంగా వుంది. ‘ఐతే’ సినిమా చేస్తున్నప్పుడు నేను కూడా ఒక బెస్ట్ కెమరామేన్ అవ్వాలని కల కన్నాను. అక్కడి నుంచి ప్రయాణం మొదలైతే.. ఈ రోజు ఒకటికాదు.. రెండు కాదు.. మూడు వెయ్యి కోట్ల సినిమాలు చేశాను. చాలా ఆనందంగా వుంది. బహుసా ఆస్కార్ కమిటీలో వున్న ఇండియన్ టెక్నిషియన్ ని నేను అనుకుంటాను. ఇటివలే ఇన్విటేషన్ వచ్చింది. ఇది ఒక అచీవ్మెంట్ గా భావిస్తున్నా. తెలుగు సినిమా చేస్తే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనడానికి ఇది నిదర్శనం’’ అన్నారు    

కోదండరామి రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడి ఊహకు వందరెట్లు బెటర్ గా చూపించే సినిమాటోగ్రాఫర్స్ నిజంగా గొప్పవాళ్ళు. ప్రతి దర్శకుడు మీకు రుణపడివుంటారు. ఎంతోమంది పెద్ద  సినిమాటోగ్రాఫర్స్ తో పని చేయడం నా అదృష్టం’’ అన్నారు.

వివి వినాయక్ మాట్లాడుతూ..  ఈ వేడుక చూస్తుంటే చాలా అత్మీయంగా వుంది. చిన్నప్పుడు ఫోటోగ్రఫర్ అవ్వాలని వుండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కెమరాగురించి తెలిసింది. కొత్తగా వచ్చే కెమరామెన్స్ కి ఒక సలహా. దర్శకులు ఏం చెప్తే అది చేయడం మంచిదే. కానీ కొందరికి లైటింగ్ మీద అంత పట్టులేకపోవచ్చు. అలాంటప్పుడు దర్శకుడని కన్విన్స్ చేసి చేయాల్సిన బాధ్యత వుంది. ఇలాంటి విషయంలో చోటా కే నాయుడు దిట్ట(నవ్వుతూ) ఎవరినైనా మ్యాజిక్  చేస్తారు. ఆ మ్యాజిక్ అందరూ నేర్చుకొని మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ వేడుకు రావడం ఆనందంగా వుంది’’ అన్నారు.

కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. సినిమాటోగ్రాఫర్స్ అందరికి బర్త్ డే లాంటి వేడుక ఇది. నా ప్రయాణంలో విఎస్ఆర్ స్వామీ, విన్సెంట్ లాంటి గొప్ప సినిమాటోగ్రాఫర్స్ తో పని చేసే అవకాశం దొరికింది. తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి, హరి, శరత్ రసూల్ ఇలా ఎంతోమందితో ట్రావెల్ వుంది. ఇలాంటి కార్యక్రమాలని యూనియన్స్ ముందుకు తీసుకువెళ్ళాలి. ఇలాంటి వేడుకలు జరగడం చాలా అనందంగా వుంది. సినిమా విజువల్ మీడియం. కథని విజువల్ గా చూపించేది సినిమాటోగ్రాఫర్స్. కళతో కూడుకున్న బిజినెస్ సినిమా మాత్రమే’’ అన్నారు.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ..  సినిమాటోగ్రఫర్స్ సినిమాకి హార్ట్ అండ్ సోల్. సినిమా అనేది కళ. ఆ కళకు కళ్ళు ఇచ్చేది సినిమాటోగ్రఫర్స్. ఈ వేడుక ఇంత ఘనంగా జరగడం,  అందరిని కలవడం చాలా ఆనందంగా వుంది.

ఒక సినిమా విజయంలో సినిమాటోగ్రఫర్స్ కంట్రీబ్యుషన్ చాలా వుంటుంది. ఇలాంటి వేడుకలు సినిమాటోగ్రఫర్స్ కు మరింత స్ఫూర్తిని ఇస్తాయి’’ అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News