12A రైల్వే కాలనీ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో థ్రిల్ చేసే సినిమా. ఆడియన్స్ ఖచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారు: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్

Must Read

అల్లరి నరేష్, డాక్టర్ అనిల్ విశ్వనాథ్, నాని కాసరగడ్డ, శ్రీనివాసా చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ’12A రైల్వే కాలనీ’ గ్రిప్పింగ్ & మిస్టీరియస్ ట్రైలర్ లాంచ్

అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ’12A రైల్వే కాలనీ’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేసింది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు.

తాజాగా లాంచ్ చేసిన “12A రైల్వే కాలనీ” ట్రైలర్‌ సినిమా టోన్‌ , మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. మిస్టరీ మర్డర్స్ సిరీస్‌ చుట్టూ తిరిగే కథలో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఈ ట్రైలర్‌ సస్పెన్స్‌ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. మూఢనమ్మకాలు, హీరోకి ఎదురైన భయానక అనుభవాలతో పాటు వాస్తవం – మానసిక భ్రమలు మరింత థ్రిల్ ని క్రియేట్ చేశాయి.

దర్శకుడు నాని కాసరగడ్డ, డా. విశ్వనాథ్ రాసిన థ్రిల్లింగ్‌ కథను తెరపై సస్పెన్స్‌తో ప్రజెంట్ చేశారు. అల్లరి నరేష్‌ ఈసారి తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, ఇంటెన్స్ ఎమోషన్స్ తో అదరగొట్టారు. అతని పాత్రలోని డిఫరెంట్ లేయర్స్ కట్టిపడేశాయి. డా. కమాక్షి భాస్కర్ల తన సహజ నటనతో కథకు ఎమోషన్ యాడ్ చేశారు. సాయి కుమార్‌ ఇన్వెస్టిగేషన్‌ యాంగిల్‌కి బలాన్నిచ్చారు. వైవా హర్ష సపోర్టింగ్‌ రోల్‌లో ఆకట్టుకున్నారు.

కుశేందర్‌ రమేశ్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ, భీమ్స్‌ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ టెన్షన్‌ను రెట్టింపు చేసింది. ప్రొడక్షన్‌ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. ట్రైలర్‌తో, “12A రైల్వే కాలనీ” పై అంచనాలు పెరిగిపోయాయి. నవంబర్‌ 21న విడుదల కానున్న ఈ సినిమా ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. నా సామి రంగ సక్సెస్ తర్వాత నిర్మాత శ్రీనివాస్ గారు నాతో మరో సినిమా చేయాలని అన్నారు. నచ్చిన కథ ఉంటే చూడమని చెప్పారు. తర్వాత మేము చాలా రకాల కథలు విన్నాము. తర్వాత అనిల్ దగ్గర మంచి కథ ఉందని చెప్పారు. నేను ఇప్పుడు వరకు చాలా జానర్స్ చేశాను కానీ ఇలాంటి థ్రిల్లర్స్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ఇలాంటి జానర్ ట్రై చేస్తే బాగుంటుందనిపించింది. చాలా మల్టీ లేయర్స్ ఉండే కథ. ఏ కథ ఎటు నుంచి ఓపెన్ అవుతుంది ఎండ్ అవుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా రేసి ఎక్సైటింగ్ సినిమా ఇది. అని అనిల్ గారు రైటింగ్ స్కిల్స్ నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ నాని సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. తను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. కంగ్రాజులేషన్స్. ఈ సినిమా సక్సెస్ తో తనకి మంచి గిఫ్ట్ ఇస్తాం. చాలా టాలెంటెడ్ టీం తో పనిచేసిన సినిమా ఇది. కామాక్షి చాలా నేచురల్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. డిఓపి రమేష్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఆయనతో మరోసారి పనిచేయాలని ఉంది. బీమ్స్ గారు వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోను లే అనే పాట చెప్పినప్పుడే నేను తనని నమ్మాను. ఆ పాట బయటకు వచ్చి చాలా పెద్ద హిట్ అయింది. అలాగే కెవ్వు కేకలో బాబు రాంబాబు పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది. నాకు కెరీర్ బెస్ట్ సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్. ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా మెలోడీస్ చేశారు. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బీమ్స్ గారి గురించి నాలుగు లైన్స్ ఎక్కువ రాస్తారు. ఆయన మరిన్ని భారీ ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎవరు విలన్ అవుతారనేది గెస్ చేయలేరు. ఆడియన్స్ అందర్నీ చాలా థ్రిల్ చేస్తుంది .ఈ సినిమా 21వ తారీకున మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా చూసి రెండు మూడు చోట్ల మీరు జర్క్ అవుతారు. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని బ్లెస్స్ చేయాలని కోరుకుంటున్నాను.

కామాక్షి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం చేశారు. ఇది నా కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమా అవుతుందని నమ్మకం ఉంది. మా నిర్మాతలు శ్రీనివాస్ గారికి, షో రన్నర్ అనిల్ గారికి డైరెక్టర్ నాని గారికి మా హీరో నరేష్ గారికి థాంక్యూ. ఈ నలుగురు ఈ సినిమాకి నాలుగు స్తంభాలు . వీళ్ళ నలుగురు వల్లే నేను ఈ సినిమాలో ఉన్నాను. ఈ సినిమా తర్వాత అందరూ నన్ను ఆరాధన అని పిలుస్తారనే నమ్మకం ఉంది. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. నవంబర్ 21న అందరూ థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ నాని మాట్లాడుతూ.. నా పేరు నాని. నవంబర్ 21 తర్వాత ఈ పేరు గట్టిగా వినిపిస్తుందని బలంగా నమ్ముతున్నాను. సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ వున్నాం, ఈ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి హీరో నరేష్ గారికి థాంక్యూ సో మచ్. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. నవంబర్ 21 అందరూ థియేటర్స్ లో సినిమా చూస్తారని కోరుకుంటున్నాను.

షో రన్నర్ అనిల్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మంచి కథ కాన్సెప్ట్ తో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వస్తున్న సినిమా ఇది. పొలిమేర సినిమాకి మీరందరు ఎంతగానో ఆదరించారు. ఇది కూడా ఒక డిఫరెంట్ సినిమా. ఈ కథని నరేష్ గారు యాక్సెప్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన లేకపోతే ఇదొక చిన్న కథగా అయిపోయేది. ఆయన ఓకే చేశారు కాబట్టి ఇంత డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో సినిమా చూడబోతున్నారు. నాని ఈ సినిమా తో డెబ్యూ చేస్తున్నారు. అద్భుతంగా తీశాడు. మా నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి ఇది మంచి ట్రీట్ లా ఉండబోతుంది. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆడియన్స్ సర్ప్రైజ్ అయిపోయే సినిమా ఇది.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ … ఈ సినిమాలో వాట్ నెక్స్ట్ అనేది మనం ఎవరు కూడా ఊహించలేము. నాకు ఒక డిఫరెంట్ మ్యూజిక్ చేయడానికి స్కోప్ ఇచ్చిన సినిమా ఇది. నరేష్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో ద బెస్ట్ మెలోడీస్ చేశాను. నవంబర్ 21న థియేటర్స్ లో సినిమా చూస్తారని కోరుకుంటున్నాను. మూవీ యూనిట్ అందరూ పాల్గొన్న ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

నటీనటులు: అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సమర్పణ: పవన్ కుమార్
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ & షోరన్నర్: డాక్టర్ అనిల్ విశ్వనాథ్
ఎడిటర్ & డైరెక్టర్: నాని కాసరగడ్డ
డిఓపి: కుశేందర్ రమేష్ రెడ్డి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
VFX: త్రివేణి కాసరగడ్డ (నియో స్టూడియోస్)
సౌండ్ డిజైన్: రఘునాథ్
DI: అన్నపూర్ణ స్టూడియోస్
కలరిస్ట్ : రఘు తమ్మారెడ్డి
సౌండ్ మిక్స్ ఇంజనీర్: కృష్ణ రాజ్ ఆర్ముగం
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News