ప్రముఖ నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్.యూనివర్సిటీ చైర్మన్ కొనేరు సత్యనారాయణ సినీ రంగంలోనూ రాణిస్తున్నారు. కె స్టూడియోస్ బ్యానర్‌పై ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ఆయన ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘ఎస్ బాస్’ను రూపొందిస్తున్నారు. కాంచన కోనేరు సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మిస్టరీ థ్రిల్లర్ ‘సెవన్’ తర్వాత డైనమిక్ యాక్టర్ హవీష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ‘నువ్విలా’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన హవీష్, ‘రామ్ లీల’, ‘జీనియస్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.
‘భాగమతి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అశోక్ ‘ఎస్ బాస్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా అన్నీ అంశాలతో రూపొందుతోంది. మంగళవారం హవీష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎస్ బాస్ చిత్రం నుంచి హవీష్ స్టైలిష్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కతోన్న ‘ఎస్ బాస్’ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ చిత్రాన్ని కథ, మాటలను అందించారు. సీనియర్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించారు. ఆయన ఈ చిత్రంలో నటిస్తుండటంతో ఎంటర్‌టైన్‌మెంట్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంటుందనటంలో సందేహం లేదు. ప్రముఖ టెక్నీషియన్ కబీర్ లాల్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…