రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలే కాకుండా మన నేటివిటీని, మన ఆచార సంప్రదాయాల్ని చూపించే చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా రావడం లేదు. కానీ మన ఆచార, సంప్రదాయాలు, మన సంస్కృతిని చాటేలా, మన ఇతిహాసగాథలైన రామాయణం నుంచి ప్రేరణపొంది ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమాను సతీష్ పరమవేద తెరకెక్కించారు.
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వదిలిన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం జూన్ 21న భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి వద్దకు చిత్రయూనిట్ వెళ్లింది.
సీఎం రేవంత్ రెడ్డి గారికి చిత్ర టీజర్, ట్రైలర్‌ను చూపించారు. సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్‌ను వీక్షించిన ముఖ్యమంత్రివర్యులు చిత్రయూనిట్‌ను ప్రత్యేకంగా నిర్మాతను అభినందించారు. ట్రైలర్ మరియు పాటలు చాలా బాగున్నాయని సినిమా పెద్ద హిట్ అవ్వాలని, యూనిట్‌కు మంచి పేరు రావాలని అన్నారు. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, నిర్మాత రాచాల యుగంధర్, డైరెక్టర్ సతీష్, నీరూస్ ప్రతినిధి అసీమ్, నటీనటులు సుమన్ తేజ్, గరీమ చౌహాన్, గగన్ విహారి కెమెరామెన్ పరశురామ్ తదితరులు ఉన్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…