“సత్యభామ”తో నా కెరీర్ లో కొత్త ప్రయత్నం చేశా

Must Read

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. జూన్ 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

మూవీ ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ శశికిరణ్ తిక్క మాట్లాడుతూ – నా కొత్త సినిమా స్క్రిప్ట్ తో పాటు “సత్యభామ” స్క్రిప్ట్ కూడా రాస్తూ వచ్చాను. ఈ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా సుమన్ చిక్కాల బాగుంటాడు అనిపించింది. అందుకే అతనికి బాధ్యతలు అప్పగించాము. గూఢచారి సినిమా చేస్తున్న టైమ్ లో నా ఫ్రెండ్ రమేష్ ప్రశాంత్ ఈ కథను చెప్పారు. ఈ కథ వినగానే ప్రేక్షకులు చెప్పాల్సిన స్టోరి అనిపించింది. ఆ తర్వాత నేను మేజర్ సినిమా కోసం ఎంగేజ్ అయ్యాను. అది పూర్తయ్యాక “సత్యభామ” సినిమా స్క్రిప్ట్ బెటర్ మెంట్ చేస్తూ వచ్చాం. ఇలా ఎగ్జైట్ చేసే కథలు నా దగ్గర ఉన్నాయి. వాటిలో కొన్ని నేను డైరెక్ట్ చేస్తాను మరికొన్ని నా టీమ్ లోని వాళ్లు చేస్తారు. “సత్యభామ” సినిమాను వేరే భాషల్లోకి తీసుకువెళ్లకూడదు అని ఏం లేదు. ఈ సినిమా పూర్తిగా మన హైదరాబాద్ బేస్డ్ గా జరుగుతుంది. లోకల్ కథ. మన నేటివిటీ ఉంటుంది. అందుకే ముందు తెలుగులో పర్పెక్ట్ గా తీసుకొచ్చి ఆ తర్వాత మిగతా భాషల గురించి ఆలోచించాలని అనుకున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ బాబీ తిక్క మాట్లాడుతూ – క్రైమ్ థ్రిల్లర్ కథతో మా “సత్యభామ” సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందింది. జూన్ 7న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మా మూవీకి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

దర్శకుడు సుమన్ చిక్కాల మాట్లాడుతూ – “సత్యభామ” కథలో యాక్షన్ తో పాటు ఎమోషన్ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ అంటే కేవలం ఒక యూనిఫామ్ వేసుకుని యాక్షన్ చేయడం కాదు కాజల్ క్యారెక్టర్ లో ఎమోషన్ ఉంటుంది. ఒక కేసు విషయంలో తను పర్సనల్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది. యాక్షన్, ఎమోషన్ రెండు చేయగలదు కాబట్టే కాజల్ ను ఎంచుకున్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ జర్నీలో ఒక స్పెషల్ కేసు ఉంటుంది వాళ్లు హ్యాండిల్ చేసింది. ఈ సినిమాలో కాజల్ కూడా ఒక కేసును పర్సనల్ గా తీసుకుంటుంది. ఆ కేసు విషయంలో ఎమోషనల్ అవుతుంది. ఆ కేసులో జస్టిస్ చేయగలిగిందా లేదా అనేది “సత్యభామ” కథ. అన్నారు.

క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ – “సత్యభామ” సినిమాతో నా కెరీర్ లో కొత్త ప్రయత్నం చేశా. ఇలాంటి క్యారెక్టర్, మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ వినగానే నచ్చింది కొత్తగా అనిపించింది అందుకే సినిమా చేసేందుకు ముందుకొచ్చా. నేను ఇలాంటి కథల్లో, క్యారెక్టర్స్ లో నటించాలి అనేది మైండ్ లో పెట్టుకోలేదు. మంచి కంటెంట్ ఉంటే ఏ జానర్ అయినా చేస్తాను. “సత్యభామ” కంటే ముందు ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కోసం ఆఫర్స్ చాలా వచ్చాయి. అయితే నేను ఆ మూవీస్ చేసేంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడే ఒప్పుకోవాలని అనుకున్నా. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నా మీద ప్రెజర్ ఉంది అనుకోవడం కంటే రెస్పాన్సిబిలిటీ ఉందని అనుకుంటా. ఈ సినిమాలో చాలా కొత్త ఎమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైమ్ నా కెరీర్ లో యాక్షన్, భారీ స్టంట్స్ చేశాను. వాటి కోసం చాలా కష్టపడ్డాను. “సత్యభామ” నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు నా కెరీర్ మరో కొత్త దిశలో వెళ్తుందని అనుకోవచ్చు. యాక్టింగ్ నా ప్యాషన్ అందుకే నా పర్సనల్ లైఫ్ లోకి వెళ్లిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ ను కలిసినప్పుడు ఆయన నేడు క్రిమినల్స్ గేమింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా క్రైమ్స్ ఎలా చేస్తున్నారో వివరించారు. ఆయన చెప్పిన అంశాలు మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. వాటిని కథలో పార్ట్ చేశాం. నేను ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. “సత్యభామ” తో ఆ కోరిక తీరిందని అనుకుంటున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ – సంగీత దర్శకుడిగా నేను ఈ తరహా చిత్రాలే చేస్తానని టైప్ కాస్ట్ అవడం ఇష్టం లేదు. అయితే నేను చేసిన సినిమాల్లో ఎక్కువ థ్రిల్లర్స్ ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్స్, స్పై థ్రిల్లర్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ వంటి మూవీస్ చేశాను. “సత్యభామ” ఒక కాప్ థ్రిల్లర్. శశికిరణ్ తో మరోసారి వర్క్ చేస్తున్నా. కాజల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు చాలా జాగ్రత్తగా మ్యూజిక్ చేశాను. కీరవాణి గారితో పాట పాడించే అవకాశం ఈ సినిమాతో నాకు దక్కింది. మంచి సింగర్స్ చాలా మంది ఉన్నారు అందుకే నా సినిమాల్లో పాటలు నేను పాడటం లేదు. అన్నారు.

నటీనటులు – కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్: అవురమ్ ఆర్ట్స్
స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క
నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి
కో ప్రొడ్యూసర్ – బాలాజీ
సినిమాటోగ్రఫీ – బి విష్ణు
సీఈవో – కుమార్ శ్రీరామనేని
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
దర్శకత్వం: సుమన్ చిక్కాల

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News