“రామం రాఘవం” టీజర్ విడుదల !!!

Must Read

స్కేట్ పెన్సిల్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో ధనరాజ్ కొరణాని దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం “రామం రాఘవం”. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు బాలా, పాండిరాజ్, సముద్రఖని, నటులు బాబీ సింహా, తంబి రామయ్య, హాస్య నటుడు సూరి, నటుడు దీపక్, నటుడు హరీష్. తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా .. 

దర్శకుడు బాలా మాట్లాడుతూ.. రామం రాఘవం టీజర్ బాగుంది. ధనరాజ్ దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ముఖ్యంగా సముద్రఖనిని మెచ్చుకోవాలి, ఇలాగే అతను చాలా మందికి సహాయం చేసి.. ప్రోత్సహించాలి, రామం రాఘవం పెద్ద విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

నిర్మాత, పృథ్వి పోలవరపు మాట్లాడుతూ… సముద్రకని అన్న సహాయం లేకుండా నేను ఈ సినిమా చేయలేను. ఈ సినిమా తీయడంలో ఖని  అన్న చాలా ముఖ్యమైన వ్యక్తి. తండ్రీ కొడుకుల అనుబందాల గురించి చెప్పే ఈ సినిమా బాగా వచ్చింది, జనాలకు నచ్చుతుందని పేర్కొన్నారు. 

నటి మోక్ష మాట్లాడుతూ.. తమిళంలో ఇది నా మొదటి సినిమా. తమిళ సినిమాలను ఇష్టపడే తమిళ అభిమానులు తప్పకుండా నన్ను ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. తమిళ గడ్దలో తొలి అడుగు వేయడం ఆనందంగా ఉందని చెప్పారు.  

నటుడు బాబీ సింహా మాట్లాడుతూ..  “రామం రాఘవం” దర్శకుడు ధనరాజ్ నా స్నేహితుడు. కష్టపడి పనిచేయడం అతని గొప్పతనం. తండ్రీ కొడుకుల అనుబంధం గురించి ఓ కథ చెప్పాడు. అద్భుతంగా ఉంది. తండ్రి క్యారెక్టర్ ఎవరని అడిగాను ఖని  బ్రదర్ అని అన్నారు. ఇకపై ఈ చిత్రం అతనిది, అతను ఈ చిత్రాన్నిపూర్తిగా క్యారీ చేసుకుంటాడు అని చెప్పా. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  ధనరాజ్లో  ఉన్న దర్శకుడిని చూసి చాలా ఆశ్చర్యపోయా. 

నటుడు తంబి రామయ్య మాట్లాడుతూ.. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ధనరాజ్ లో గొప్ప దర్శకుడు ఉన్నాడు. అతను తప్పకుండా విజయం సాధిస్తాడు. ఇంకా రెండు, మూడు భాషల్లో కూడా తెరకెక్కిస్తే బాగుటుంది. ఎందుకంటే టీజర్లోనే ఆ బలం కనిపిస్తోందని చెప్పారు.
 
నటుడు సూరి మాట్లాడుతూ.. “వెన్నిలా కబడ్డీ కులు” చింతంలో నేను నటించిన  పాత్రలో  తెలుగులో ధనరాజ్ నటించాడు. తమిళం కన్నా తెలుగులో ఆ కామెడీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఒక హాస్యనటుడు దర్శకుడిగా మారడం చాలా ఆనందంగా ఉంది. తండ్రీకొడుకుల బంధం ఉన్న సినిమాలు ఫ్లాప్ అయిన చరిత్ర లేదు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని పేర్కొన్నారు.  

దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ..  నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. రచయిత శివప్రసాద్ కథ ఇది. ఈ కథ గురించి ఖని అన్నకి  చెప్పాను. కథను నువ్వే డైరెక్ట్ చేయాలి అని చెప్పాడు. నేను నటించిన చిత్రాలకు పనిచేసిన దర్శకుల నుండి నేను నేర్చుకున్న విషయాల ఆధారంగా నేను దర్శకత్వం వహించాను. ఇప్పటి వరకు 100 చిత్రాల్లో నటించా. ఆ సినిమా దర్శకులు అందరూ నా గురువులే. వారు నేర్పిన పాఠాలతో ఈరోజు దర్శకుడిగా మారా. సముద్రఖని అన్న లేకుంటే ఈ సినిమా  పూర్తయ్యేది కాదు, నేను దర్శకుడిని అయ్యే వాడిని కాను. అందరూ వాళ్ళ నాన్నతో కలిసి ఈ సినిమా చూడాలని చెప్పారు. 

Ramam Raghavam Teaser Telugu | Latest Telugu Teaser | Samuthirakhani | Dhanraj Koranani

సముద్రఖని
మాట్లాడుతూ…  సంతోషకరమైన సమయం ఇది. నేను తండ్రిగా దాదాపు 10కి పైగా సినిమాల్లో నటించా. ఒక్కొక్కటి విభిన్న కథతో. అలాంటి మరో కొత్త కథ ఇది.
ధనరాజీకి తల్లిదండ్రులు లేరు. స్వతహాగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. మంచి కథ ఇది.. అందుకు తగ్గ దర్శకుడు ఉండాలి అని అనుకున్నా. ధనరాజ్ పై నాకు పెద్ద నమ్మకం ఉంది. అందుకే, అతన్నే దర్శకత్వం చేయమని చెప్పా.  దర్శకుడిగా అతను పెద్ద విజయాన్ని అందుకుంటాడు. ప్రతి తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధాన్ని చాటే చిత్రం ఇది. నిర్మాతను నేనెప్పుడూ కలవలేదు. చిత్రీకరణ సమయంలో మొదటిసారి చూశాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పారు. 

Latest News

Actor Yogesh Kalle in the Pan India Film Trimukha

Actor Yogesh kalle is making his acting debut with the Pan Indian Film "Trimukha" in which nassar, CID Aditya...

More News