మహారాజ కి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్

Must Read

మహారాజా మాస్టర్ పీస్ సినిమా. ఫ్యామిలీస్ తో కలసి వెళ్లి సినిమా చూడండి. చాలా సర్ ప్రైజ్ అవుతారు: డైరెక్టర్ మారుతి 

ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా మహారాజ. మంచి కల్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్ వచ్చింది: డైరెక్టర్ గోపీచంద్ మలినేని 

మహారాజ చాలా పెద్ద హిట్టు. ఏ రేంజ్ కి వెళ్లి ఆగుతుందో చెప్పలేం: డైరెక్టర్ బుచ్చిబాబు సాన  

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘మహారాజ’. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్‌విఆర్ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలలోమ్యాసీవ్ గా రిలీజ్ చేసింది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా జూన్ 14న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి విమర్శకులు ప్రసంశలు అందుకొని మాస్టర్ పీస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ ని నిర్వహించింది.  

థాంక్ యూ మీట్ లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. రిలీజ్ ముందు ప్రెస్ మీట్ కి వచ్చినప్పుడు మీ అందరూ చాలా ప్రేమ అభిమానం చూపించారు. మీ ప్రేమ చూసి కొంచెం భయం వచ్చింది. సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకున్నారు. మహారాజకి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీరు చూపిన ప్రేమ చూస్తుంటే.. ఇది నా హోమ్ టౌన్ లానే అనిపిస్తోంది. ఇంత కంఫర్ట్ ఇచ్చిన ఆడియన్స్ కి మీడియాకి అందరికీ థాంక్ యూ సో మచ్. తెలుగు ఆడియన్స్ ఎక్కడ కలిసి 96, మాస్టర్, విక్రమ్, ఉప్పెన.. ఇలా నా చిత్రాలన్నీ తమకు ఎంతో ఇష్టమని చెబుతుంటారు. ఆడియన్స్ అందరికీ థాంక్స్. ఈ ఈవెంట్ కి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ థాంక్ యూ. నిజానికి మీరంతా వస్తారని నేను వూహించలేదు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థాంక్. సినిమా గురించి ఇంత గొప్ప మాట్లాడటం వింటుంటే చాలా ఆనందంగా వుంది. చాలా ఎమోషనల్ గా వుంది. బుచ్చి నా యంగర్ బ్రదర్ లాంటి వాడు. ఉప్పెనలాంటి మంచి సినిమా తీశాడు. ఇప్పుడు రామ్ చరణ్ గారితో సినిమా చేస్తున్నాడు. తను ఇక్కడకి రావడం సర్ ప్రైజింగ్ గా అనిపించింది. మహరాజకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. అందరికీ థాంక్స్. లవ్ యూ ఆల్’ అన్నారు.  

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. మహారాజ గురించి అందరూ చాలా హార్ట్ ఫుల్ గా మాట్లాడుతున్నారు. ఈ సినిమా చూసి షాక్ అయ్యాను. ఇంటర్వెల్ కే సినిమా గురించి ఇన్స్టా లో పోస్ట్ చేశాను. చాలా గొప్ప సినిమా ఇది. మాస్టర్ పీస్ సినిమా. దర్శకుడు చాలా అద్భుతంగా రాసి తీశారు. ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయి. ఇలాంటి సినిమా తెలుగు ప్రేక్షకులకి అందించిన టీం అందరికీ థాంక్స్. విజయ్ సేతుపతి గారు ఈ జనరేష్ కి గ్రేట్ ఆర్టిస్ట్. డైరెక్టర్స్ ఫేవరేట్ హీరో. ఆయన ఇలాంటి గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మహారాజని థియేటర్స్ లో మిస్ అవ్వొద్దు. ఫ్యామిలీస్ తో కలసి వెళ్లి సినిమా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. 

డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ..మహారాజ లాంటి మంచి సినిమా ఇచ్చిన విజయ్ సేతుపతి గారికి, డైరెక్టర్ గారికి థాంక్ యూ. ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా ఇది. మంచి కల్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్. ఒక మంచి సినిమా చూస్తే అది చాలా కాలం వెంటాడుతుంది. నేను అదే వైబ్ లో వున్నాను. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఈ సినిమా చూస్తున్నపుడు ఒక జీవితాన్ని చూసిన ఫీలింగ్ కలిగింది. ఎక్స్ ట్రార్డినరీ స్క్రీన్ ప్లే. విజయ్ సేతుపతి గారు నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. ఇండియాలో వన్ అఫ్ ది బెస్ట్ యాక్టర్ విజయ్ సేతుపతి గారు. ఆయన జెమ్. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఎక్స్ ట్రార్డినరీ. డైరెక్టర్ అద్భుతమైన వర్క్ చేశారు. ఇదొక కల్ట్ ఫిల్మ్. రూట్స్ లోకి వెళ్ళిపోయింది. మహారాజ లాంటి మంచి సినిమా ఇచ్చిన విజయ్ సేతుపతి గారికి థాంక్ యూ’ అన్నారు. 

డైరెక్టర్ బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. ఈ సినిమా చూసి ఫస్ట్ గూగుల్ లో ఈ డైరెక్టర్ ఎలా ఉంటారని సెర్చ్ చేశా. చాలా డేరింగ్ క్లైమాక్స్. ఈ సినిమా గురించి ఏం చెప్పినా ఎక్స్ పీరియన్స్ పాడైపోతుంది. ఇందులో ప్రతి సీన్ అద్భుతం. విజయ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన హీరో అంతే. ఆయన ఇలాంటి సినిమాలే చేయాలనే కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్టు. ఏ రేంజ్ కి వెళ్లి ఆగుతుందో చెప్పలేం. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు. 

డైరెక్టర్ అనీల్ కన్నెగంటి మాట్లాడుతూ.. మాస్టర్ పీస్ అంటే మాటకు సరిగ్గా సరిపోయే సినిమా మహారాజ. ఇందులో ఎమోషన్ ని విజయ్ సేతుపతి గారు చివరి వరకూ తన కళ్ళలో చూపించారు. ఈ సినిమా చూసిన ఎక్సయిట్మెంట్ ఆగడం లేదు. ఇది అద్భుతమైన సినిమా. మహారాజ లాంటి మంచి సినిమా ఇచ్చిన విజయ్ సేతుపతి గారికి థాంక్ యూ సో మచ్’ అన్నారు. 

మూవీ డైరెక్టర్ నితిలన్ సామినాథన్.. తెలుగు ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. సినిమాని చాలా ఇష్టంగా ప్రేమిస్తారు. ఈ సినిమాకి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. కథ, స్క్రీన్ ప్లే, పెర్ఫార్మెన్స్ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది” అన్నారు  

డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రీరిలీజ్ విజయ్ సేతుపతి గారి నటవిశ్వరూపం చూస్తారని చెప్పాను. ఇప్పుడు స్క్రీన్ మీద అదే చూశారు. విజయ్సేతుపతి గారి తెలుగ ఆడియన్స్ ఇచ్చిన బ్రహ్మరధం ఈ కలెక్షన్స్. మొదటి రోజు నుంచు స్క్రీన్ పెంచుతూనే వున్నాం. రోజురోజుకి 200 పెర్సెంట్ గ్రోత్. రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. మహారాజతో మాకు డబ్బుతో పాటు పేరు కూడా వచ్చింది. ఈ సినిమా ఎంత రేంజ్ అనేది ఇంకా ఎవరూ చెప్పలేరు. రోజురోజుకి జనాలు పెరుగుతున్నారు. ఈ ఏడాది హనుమాన్ తర్వాత ఇంతపెద్ద హిట్ ఈ సినిమానే అని నమ్ముతున్నాను. విజయ్ గారిపై తెలుగు ప్రేక్షకులకు వున్న ప్రేమరోజురోజుకి పెరుగుతూనే వుంటుంది. ఇప్పటివరకూ సినిమా చూసిన వారికి ధన్యవాదాలు. చూడనివారు థియేటర్స్ కి రండి. ఖచ్చితంగా చాలా సర్ ప్రైజ్ అవుతారు’ అన్నారు. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News