‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఆ తరం నటీమణి, గాయని స్టూడియో అధినేత అయిన కృష్ణవేణి జీవితం ఈ తరం వారికి మార్గదర్శకంగా ఉంటుందని, అందుకే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.

మహానటుడు ఎన్ . టి. రామారావు గారిని మనదేశం సినిమా ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణ వేణి గారంటే తనకు ఎంతో గౌరవమని చంద్రబాబు తెలిపారు. ఈ పుస్తకావిష్కరణలో కృష్ణవేణి కుమార్తె అనురాధా దేవి, నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్, నిర్మాతలు డీవీకే రాజు, ఉమామహేశ్వరరావు, పర్వతనేని రాంబాబు, కాకాని బ్రహ్మం, క్రొత్తపల్లి శ్రీధర్ ప్రసాద్, శ్రీమతి ఝాన్సీ రాణి, యువహీరో అభిరామ్, గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొన్నారు. తన పుస్తకం సీఎం చంద్రబాబు ఆవిష్కరించడం మర్చిపోలేని అనుభవమని రచయిత భగీరథ సంతోషం వ్యక్తం చేశారు.


TFJA

Recent Posts

‘శబార’ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది.. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ఈవెంట్‌లో హీరో దీక్షిత్ శెట్టి

దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…

30 minutes ago

షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం…

తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో…

19 hours ago

యూవీ కాన్సెప్ట్స్, సంతోష్ శోభన్ “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి ‘గాబరా గాబరా..’ లిరికల్ సాంగ్ రిలీజ్

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…

19 hours ago

ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ‘హే భగవాన్‌’

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

19 hours ago

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో…

4 days ago

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…

4 days ago