దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్ మీద హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన ప్రపంచాన్ని ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ద్వారా పరిచయం చేశారు. మిథున్ ముకుందన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. అజయ్ అబ్రహం జార్జ్ ఈ సినిమాకి కెమెరామెన్‌గా పని చేశారు. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ అంటూ నిర్వహించిన కార్యక్రమంలో..
దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ .. ‘‘శబార’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకి మీడియా మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ‘శబార’కి కూడా అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. శబార అంటే ప్రపంచం.. ప్రేమ్ చంద్ క్రియేట్ చేసిన ప్రపంచమిది. అడవిలోనే మొత్తం కథ జరుగుతుంది. ఈ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది. నేను ఇంత వరకు 8 సినిమాలు చేశాను. మొదటి సారిగా ఓ మనిషి మీద నమ్మకం పెట్టుకుని ప్రేమ్ చంద్ కోసం ఈ మూవీని చేశాను. రెండేళ్లుగా మాతో ప్రయాణం చేసిన టీంకు థాంక్స్. మిథున్ తన మ్యూజిక్‌తో మాయ చేశారు. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ నచ్చితే షేర్ చేసి, అందరికీ చేరేలా సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
దర్శకుడు ప్రేమ్ చంద్ కిలారు మాట్లాడుతూ .. ‘హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’కి మంచి రెస్పాన్స్‌ను ఇచ్చారు. చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు వస్తాం. మా నాన్న నాకు దేవుడి కంటే ఎక్కువ. ఆ నాన్ననే ఎదురించి సినిమాను తీస్తున్నానంటే.. ఎలాంటి సినిమాని తీస్తుంటానో అర్థం చేసుకోండి. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన దీక్షిత్ గారికి థాంక్స్. మిథున్ గొప్ప సంగీతాన్ని అందించారు. ఇకపై నా ప్రయాణం ఆయనతోనే కంటిన్యూ చేస్తాను. అజయ్ అబ్రహం జార్జ్ పేరు ఇకపై ఎక్కువగా వినిపిస్తుంది. సినిమానే అంతా మాట్లాడుతుంది. నచ్చింది చేయడమే జీవితం’ అని అన్నారు.
క్రితిక సింగ్ మాట్లాడుతూ .. ‘ప్రేమ్ చంద్ గారు లేకపోతే ‘శబార’ ఇంత గొప్పగా వచ్చేది కాదు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థాంక్స్. హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు మరింత కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తామ’ని అన్నారు.
మీషా నారంగ్ మాట్లాడుతూ .. ‘‘శబార’ కన్నులపండుగగా ఉంటుంది. ఎన్నో అద్భుతమైన లొకేషన్లలో సినిమాని షూట్ చేశాం. ఎంతో కష్టపడి మూవీని తీశాం. అందుకే హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’ అంత గొప్పగా అనిపించింది. ప్రేమ్ చంద్ ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ‘శబార’ని మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామ’ని అన్నారు.
రాజీవ్ పిళ్లై మాట్లాడుతూ .. ‘‘శబార’లో నన్ను తీసుకున్నందుకు ప్రేమ్ గారికి థాంక్స్. ప్రేమ్ గారు ఇంత వరకు ఒక్క సినిమాకి కూడా పని చేయలేదు. కానీ ఈ మూవీని మాత్రం ఎంతో గొప్పగా, అనుభవం ఉన్న దర్శకుడిలా తీసుకున్నారు. రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం మేం వెయిట్ చేస్తున్నాం. ఇది థియేటర్లో చూడాల్సిన చిత్రం. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానుంది’ అని అన్నారు.
భూషణ్ కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘‘శబార’ కథ విన్నప్పుడు చాలా ఆశ్చర్యమేసింది. ఇలాంటి కథలు నటీనటులకు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి కథలో భాగమైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది’ అని అన్నారు.
క్యాస్టూమ్ డిజైనర్ సుమాయా మాట్లాడుతూ .. ‘‘శబార’ది రెండేళ్ల ప్రయాణం. ఇప్పటికి ఇలా ఆడియెన్స్ ముందుకు వచ్చాం. సక్సెస్ మీట్‌లో ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం’ అని అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ శివ కామేష్ మాట్లాడుతూ .. ‘ప్రేమ్ గారు గొప్ప దర్శకుడు. ‘శబార’ అద్భుతంగా వచ్చింది. ఇందులో కెమెరా వర్క్ గొప్పగా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్’ అని అన్నారు.
మోహన్ భగత్ మాట్లాడుతూ .. ‘భూషణ్ గారికి కథ నచ్చిందని నేను కూడా ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాను. ఇందులో ఐదు ఇంపార్టెంట్ కారెక్టర్స్ ఉంటాయి. సినిమాని ప్రేమ్ చంద్ గారు గొప్పగా తీశారు. నిధి చుట్టూ తిరిగే ఈ కథ చాలా అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మిథున్ ముకుందన్ మాట్లాడుతూ .. ‘హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’కి మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్. నాకు అవకాశం ఇచ్చిన ప్రేమ్ చంద్ గారికి థాంక్స్. ఆయన కథ చెప్పిన తీరు చూసిన తరువాత ఈ సినిమా వంద శాతం హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఏర్పడింది. మున్ముందు మరింత ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తామ’ని అన్నారు.
తారాగణం: దీక్షిత్ శెట్టి, మిషా నారంగ్, మోహన్ భగత్, రాజీవ్ గోవింద పిళ్లై, కృతికా సింగ్ యాదవ్, భూషణ్ కళ్యాణ్, ఆరుష్, ప్రమోదిని, శుభం తోమర్, శ్రీకాంత్, అనిరుధ్ అరుణ్ తదితరులు
సాంకేతిక బృందం
రచయిత – దర్శకుడు : కిలారు ప్రేమ్ చంద్
నిర్మాతలు: హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు
సంగీతం: మిథున్ ముకుందన్
DOP: అజయ్ అబ్రహం జార్జ్
ఎడిటర్ : భువనేష్ మణివన్నన్
ప్రొడక్షన్ డిజైనర్: శివ కామేష్ డి
యాక్షన్ డైరెక్టర్: నట్రాజ్ మడిగొండ
కాస్ట్యూమ్ డిజైనర్: సుమాయా తబస్సుమ్
సౌండ్ డిజైనర్: సాయి మనీంధర్ రెడ్డి
డాన్స్ కొరియోగ్రాఫర్: విశాల్ నాడ్స్
అదనపు స్క్రీన్ ప్లే: మనోజ్ చంద్రశేఖర్
కో-డైరెక్టర్: ఇ.రామస్వామి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ సీర్ల
సీఈవో : శ్రీనాధ్ క్రోతపల్లి
పీఆర్వో : వంశీ కాకా
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…