ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వివిధ మాధ్యమాల్లో తన పేరు, ఫోటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య పరమైన ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ వేశారు. ఈ విషయాన్ని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలను జారీ చేసింది.
ఆదేశాల మేరకు ఎన్‌టీఆర్ గారి పేరు గానీ, “ఎన్‌టీఆర్”, “జూనియర్ ఎన్‌టీఆర్”, “తారక్” లాంటి పేర్లు గానీ, “యంగ్ టైగర్”, “మ్యాన్ ఆఫ్ మాసెస్” వంటి పేర్లు గానీ, అలాగే ఆయన ఫోటోలు, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాణిజ్య పరంగా వాడితే చట్ట విరుద్దమని కోర్టు పేర్కొంది. ఎక్కడైనా ఇలా అనధికారంగా వాడినట్టు తెలిస్తే..చట్టం ప్రకారం వెంటనే తీసేయాలని ఆదేశాలను కోర్టు జారీ చేసింది.
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఇండియాలో పెద్ద సెలబ్రిటీ అని స్పష్టం చేసిన కోర్టు. ఎన్నో ఏళ్ల కెరీర్‌తో ఆయన ఈ మంచి పేరు సంపాదించుకున్నారని, ప్రజలకు ఆయన పేరు, ఫోటో, రూపం అంటే వెంటనే ఎన్‌టీఆర్ గారే గుర్తొస్తారని చెప్పింది. అందుకే ఆయన పేరు, ఇమేజ్ మీద హక్కులు ఆయనకే ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది.
ఒక వ్యక్తి పేరు, ఇమేజ్ వంటి వ్యక్తిత్వ హక్కులనేవి జీవించే హక్కు, స్వేచ్ఛతోనే కలిసి ఉంటాయని చెప్పిన ఢిల్లీ హైకోర్టు. ఇవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 కింద రక్షణ పొందుతాయని, అలాగే కాపీరైట్ చట్టం 1957, ట్రేడ్‌మార్క్ చట్టం 1999 ద్వారా కూడా అమలు చేయవచ్చని స్పష్టం చేసింది.
అదేవిధంగా ఇంటర్మీడియరీ ఫ్లాట్‌ఫామ్స్‌లో భాగమైన ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి వాటిని కూడా కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌ను 2021 ఐటీ రూల్స్ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) కింద అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, చట్టపరంగా కేటాయించిన సమయాల్లో దొరికిన హక్కుల ఉల్లంఘన లింక్‌లను తీసేయాలని కోర్టు తెలియజేసింది
కోర్టు మరో ఆదేశాన్ని కూడా ఇచ్చింది… దాని ప్రకారం ఎవరో గుర్తించని వ్యక్తులు, ఆన్‌లైన్ ట్రోల్స్ చేసేవాళ్ల, ఎవరికీ తెలియకుండా తప్పులు చేసేవాళ్లు ఎవరైనా ఎన్‌టీఆర్ గారి పేరు, ఫోటో, ఇమేజ్, గుర్తింపును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని, మెర్చండైజ్, డిజిటల్ కంటెంట్, మోర్ఫ్ చేసిన ఫోటోలు, AI కంటెంట్ లేదా ఏదైనా టెక్నాలజీ ద్వారా ఉపయోగించకూడదని ఆదేశించింది.
డిజిటల్ యుగంలో వ్యక్తిగత గుర్తింపు, పేరు, ఇమేజ్‌లను రక్షించడం చాలా ముఖ్యం. ప్లాట్‌ఫారమ్‌లు, ఇతరులు పబ్లిక్ పర్సనాలిటీలను గౌరవంగా, చట్టపరంగా మాత్రమే వాడేలాగా బాధ్యత వహించాలి. ఎవరైనా ఎన్.టి.ఆర్ పేరు లేదా ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా ప్రవరిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…