టీజర్ విడుదల చేసిన చిత్ర బృందం
డబ్బింగ్ పూర్తి….నవంబర్ లో సినిమా విడుదల
“తల్లిని గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమమయి గానే కాదు త్యాగమూర్తిగా కూడా ఆమెకు సాటి రారు మరెవ్వరు. అలాంటి ఓ తల్లి మనసు ఎలాంటి భావోద్యేగాలకు గురైంది. అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాల సమ్మేళనంతో “తల్లి మనసు” చిత్రాన్ని మలిచారు.
రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దీని ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న చిత్రమిది. .
ఇటీవలనే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని నిర్మాత ముత్యాల అనంత కిషోర్ తెలియజేస్తూ, “సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేశాం. సోషల్ మీడియాలో గురువారం టీజర్ విడుదల చేశాం.. అద్భుతమైన స్పందన లభిస్తోంది” అని చెప్పారు.
చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, “మా బ్యానర్ లో మంచి కథ, కథనాలతో ఓ చిత్రం చేయాలని సంకల్పించి ఈ చిత్రం చేశాం. నవంబర్ లో చిత్రాన్ని విడుదల చేస్తాం” అని అన్నారు
దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) మాట్లాడుతూ, “ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే కుటుంబ కథ ఇది. ఆమె ఎలాంటి సంఘర్షణలకు గురయ్యింది” అనే అంశాలతో ఆద్యంతం ప్రేక్షకులను అలరింపజేసేలా తెరకెక్కిస్తున్నాం” అని చెప్పారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో , రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, జబర్దస్త్ ఫణి తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి మూల కథ: శరవణన్, కదా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, మరుధూరి రాజా, మాటలు: నివాస్, పాటలు: భువనచంద్ర, సంగీతం: కోటి, డి.ఓ.పి: ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఆర్ట్: వెంకటేశ్వరరావు, సమర్పణ: ముత్యాల సుబ్బయ్య, నిర్మాత: ముత్యాల అనంత కిషోర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్ (సిప్పీ) .
వెరీ ట్యాలెంటెడ్ ఆది సాయికుమార్ హీరోగా యశ్వంత్ దర్శకత్వంలో శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ జూలూరు…
భారత్ కల్చరల్ అకాడమీ తెలుగు టెలివిజన్ రచయిత సంఘం ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్ సారధ్యంలో…
Q: How do you manage so many projects and handle them efficiently? At one time,…
పరిచయం:2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం, గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింప జేయడానికి ఉద్దేశించినది. దీనితోబాటు సామాజిక స్పృహ, సంప్రదాయాలు…
Isha Gramotsavam , launched by Sadhguru in 2004, holds immense significance in today's fast-paced world,…
మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్గానే ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనుల్ని…