గ్రాండ్ లాంచింగ్ ఎపిసోడ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మెగా మ్యూజికల్ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3

ఇండియన్ బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన సీజన్ 3 మోస్ట్ పాపులర్ ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమ్ అవుతోంది.

సెన్సేషనల్ కంపోజర్ ఎస్ ఎస్ తమన్, స్టార్ సింగర్స్, కార్తిక్, గీతా మాధురి జడ్జస్ గా వ్యహరించే ఈ మెగా మ్యూజికల్ షో లాంచింగ్ ఎపిసోడ్స్ ప్రస్తుతం టాప్ ట్రెండ్ లో కొనసాగుతున్నాయి.

ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర హోస్ట్ చేస్తున్న ఈ మ్యాసీవ్ మ్యూజికల్ కాంపిటేషన్ షోలో దేశ, విదేశాల నుంచి పాల్గొన్న ట్యాలెంటెడ్ కంటెస్టెంట్స్ తమ మెస్మరైజింగ్ వోకల్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు.

తొలి రెండు ఆడిషన్ ఎపిసోడ్స్ ఈ షో పై వున్న అంచనాలు మరింతగా పెంచాయి. తొలి ఎపిసోడ్ మెలోడీ బ్రహ్మమణి శర్మ ఎవర్ గ్రీన్ మెలోడీ ఈ శతమానం అన్నదిలే పాటతో మ్యూజికల్ ట్రీట్ గా ప్రారంభమైయింది. ఈ పాటకు గోల్డెన్ మైక్ తో పాటు తమన్ నుంచి స్టంప్ అందుకుంది కంటెస్టెంట్ కీర్తి. తర్వాత వచ్చిన కంటెస్టెంట్స్ కూడా అద్భుతమైన గానంతో అలరించారు.

సెకండ్ ఎపిసోడ్ లో తన వైబ్రెంట్ వోకల్స్ తో జడ్జస్ ని మైమరపించిన అనిరుద్ సుస్వరం గోల్డెన్ మైక్ ని తో పాటు పెర్ఫార్మర్ అఫ్ ది వీక్ గా నిలిచాడు. అనిరుధ్ సుస్వరన్ ఇప్పటికే చావు కబురు చల్లగా సినిమాలో పాట పాడాడు. తనను తాను నిరూపించుకోవడానికి తెలుగు ఇండియన్ ఐడల్‌కి వచ్చాడు.

శ్రీ ధుతి.. గత సీజన్‌కు వచ్చింది కానీ ఎంపిక కాలేదు. ఆమె తండ్రి మరణం తనని కలిచివేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ షోలోకి రావాలనేది తన తండ్రి కల. ఇప్పుడా కలని నెరవేర్చడానికి షోలోకి వచ్చింది. ఆమె పాడిన తలచి తలచి పాట జడ్జస్ ని మెప్పించింది.

ఒక చిన్ని బాబు, తన సోదరితో కలిసి ఆడిషన్స్‌కి వచ్చాడు. ఆ బాబు తో తమన్‌ సరదా మాట్లాడటం నవ్వులు పంచింది.

అద్భుతమైన సింగింగ్ ట్యాలెంట్ తో పాటు కంటెస్టెంట్స్ జర్నీ ఆడియన్స్ ని ఎమోషనల్ గా కదిలిచింది. జడ్జ్ గా వున్న కార్తిక్, కంటెస్టెంట్స్ తో వచ్చిన గెస్ట్ లతో కలసి పాడటం మరో హైలెట్ గా నిలిచింది.

గోల్డెన్ మైక్‌లు, గోల్డెన్ టిక్కెట్లు గెలుచుకోవడం అంత ఈజీ కాదని ఆడిషన్స్ చూస్తుంటే అర్ధమౌతోంది.

హైలీ మ్యాజికల్ గా సాగిన లాంచింగ్ ఎపిసోడ్స్ చూస్తుంటే సీజన్ 3 డబుల్ ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ ఉండబోతోందని అర్ధమౌతోంది. మొత్తానికి లాంచింగ్ ఆడిషన్ ఎపిసోడ్స్ గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

అందరి ఫేవరేట్ ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ‘ఆహా’లో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతోంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

4 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

4 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

4 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

4 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

4 days ago