దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ‘‘సర్కారు నౌకరి’’ అనే నూతన చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింగర్ సునీత తనయుడు ఆకాష్ ఈ సినిమాతో హీరోగా తెరకు పరిచయం కాబోతోన్నారు. భావనా వళపండల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. సర్కారు నౌకరి అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మేకర్లు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో హీరో సైకిల్ మీద కనిపిస్తుండటం.. బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న చెట్టుకి ఓ డబ్బా వేలాడటం, దానిపై ‘పెద్ద రోగం చిన్న ఉపాయం’ అని రాసి ఉండటం ఇవన్నీ కూడా సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి.
హీరో ఆకాష్ కూడా ఎంతో సహజంగా కనిపిస్తున్నారు. ఒక్కడి ఆలోచనతోనే విప్లవం మొదలవుతుంది అని ఈ ఫస్ట్ లుక్‌తో మేకర్లు వదిలిన క్యాప్షన్ చూస్తుంటే సినిమాలో కథ ఎంతో లోతుగా, బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రంలో ఆకాష్, భావనా వళపండల్,తనికెళ్ల భరణి,సూర్య,సాయి శ్రీనివాస్ వడ్లమాని,మణిచందన,రాజేశ్వరి ముళ్లపూడి,రమ్య పొందూరి,త్రినాథ్ నటీనటులు.
టెక్నీషియన్స్:
మ్యూజిక్ : శాండిల్య
ఆర్ట్ డైరెక్టర్ : రవి,
కో డైరెక్టర్ : రమేష్ నాయుడు దళే
కాస్ట్యూమ్ డిజైనర్ : రితీషా రెడ్డి
పీ.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ డిజైనర్: బాబు దుండ్రపెల్లి
నిర్మాణం : ఆర్.కె టెలీషో ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రఫీ,రచన,దర్శకత్వం : గంగనమోని శేఖర్
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…