రుహాణి శర్మ నటించిన HER మూవీ నుంచి ధీరే ధీరే పాట విడుదల

చిలసౌ మూవీతో రుహాణి శర్మ టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు రుహాణి శర్మ మరో కొత్త జానర్‌ను ఎంచుకున్నారు. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

HER సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా ఈ సినిమా జూలై 21న థియేటర్లోకి రాబోతోంది. అయితే ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచేసింది యూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి ఓ మెలోడీ పాటను రిలీజ్ చేశారు.

ధీరే ధీరే అంటూ సాగే ఈ పాట శ్రోతల్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ లిరికల్ వీడియోలో రుహాని శర్మ కాస్త రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చారు. ఇక ఈ పాటకు పవన్ బాణీ, మహేష్‌ పొలొజు సాహిత్యం, ఆకాంక్ష బిస్త్ గాత్రం అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి. ఈ పాట త్వరలోనే చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది.

ఈ చిత్రానికి విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందించగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరించారు. పవన్ బాణీలు కట్టారు.

తారాగణం: రుహాని శర్మ, వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ, రవి ప్రకాష్.

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: శ్రీధర్ స్వరాఘవ్
నిర్మాతలు: రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి
బ్యానర్: డబుల్ అప్ మీడియా
DOP: విష్ణు బేసి
ఎడిటింగ్: చాణక్య తూరుపు
సంగీతం: పవన్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

9 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

9 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

9 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago