TFJA

గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్న ఈ చిత్రం తాజా గాసెన్సార్ పూర్తి చేసుకుందిసెన్సార్ బోర్డ్ 'గాడ్ ఫాదర్' చిత్రానికి యూఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. 'గాడ్ ఫాదర్' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. థార్ మార్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేయడంతో పాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ముఖ్య తారాగణం. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్.గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది. స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ సమర్పణ: కొణిదెల సురేఖ బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంగీతం: ఎస్ ఎస్ థమన్ డీవోపీ: నీరవ్ షా ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్ ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు పీఆర్వో: వంశీ-శేఖర్

3 years ago

“చమన్” (ఎడారి లో పుష్పం) టైటిల్ లాంచ్

దివంగత "శ్రీ చమన్ సాబ్ గారు" ఆయన జీవిత చరిత్రను అభిమానుల కోరిక మీద, సినిమాగా తీయాలనుకోవటం జరిగింది. ఆయన బ్రతికున్న రోజుల్లోనే సినిమా స్క్రిప్ట్ పూర్తి…

3 years ago

పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 షూటింగ్ పూర్తి

పృథ్విరాజ్‌, అనూ మెహ‌త హీరోహీరోయిన్లుగా పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాబ‌రీ నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఓ క్రొత్త చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ…

3 years ago

67వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ ఈసారి బెంగుళూరులో

ప్ర‌తి ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన చిత్రాలు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులను వ‌రించే ఫిలింఫేర్ అవార్డ్స్ మొద‌టిసారి బెంగుళూరు వేధిక‌గా జ‌రుగ‌నున్నాయి. కమ‌ర్…

3 years ago

‘కృష్ణ వ్రింద విహారి’ ఎవర్ గ్రీన్ మూవీ.. :హీరో నాగశౌర్య

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'.…

3 years ago

‘Sakunthalam’.. a massive release on November 4

The massively mounted film Shaakuntalam based on internationally acclaimed Kalidasa’s Sanskrit play ‘Abhijnana Shakuntalam’ is all set to release in…

3 years ago

రీరిలీజ్ రెవెన్యూలో 75 శాతం బసవతారకం ట్రస్ట్ కి

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ థియేటర్స్ లో మాస్ జాతర సృష్టించింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు వివి.వినాయక్ దర్శకత్వంలో సెప్టెంబర్ 25, 2002లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ‘చెన్నకేశవ రెడ్డి’ మాస్ జాతర ఖండాంతరాలు దాటి 20 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గని ఈ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్త హంగులతో రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత బెల్లం కొండ సురేష్. ఈ నేపధ్యంలో దర్శకుడు వివి.వినాయక్ తో కలసి విలేఖరుల సమవేశం నిర్వహించి రీరిలీజ్ విశేషాలని పంచుకున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ. ‘చెన్నకేశవ రెడ్డి’ని భారీగా రీరిలీజ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇరవైఏళ్ల కిందట ఎంత హైబడ్జెట్ తో, క్రేజీగా ఈ సినిమా నిర్మించామో, అంతే క్రేజీగా ఇప్పుడు సినిమా రీరిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులందరూ మళ్ళీ చూసి అదే థ్రిల్ ఫీలౌతారని నమ్ముతున్నాను. రీరిలీజ్ గురించి బాలకృష్ణ గారికి చెప్పగానే ఆయన సపోర్ట్ ని తెలిజేశారు. ఆ రోజుల్లో వినాయక్ ఒక పూనకం వచ్చేలాగా సినిమా తీశారు. యాక్షన్, చేజ్, సుమోలు, హెలీ క్యాప్టర్లు, భారీగా జనాలు.. అంతా ఒక అద్భుతంలా వుంటుంది ‘చెన్నకేశవ రెడ్డి’. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికీ ఒక గొప్ప థ్రిల్ ఇచ్చే సినిమా అవుతుంది.  ఎక్కడ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్చేసినా ఒక అరగంటలో ఫుల్ అయిపోయి మళ్ళీ షోలు పెంచే పరిస్థితి వుండటం గొప్ప ఎనర్జీ ఇస్తుంది. సెప్టెంబర్ 24న ప్రిమియర్ షోలతో మొదలుపెట్టి,25న రెగ్యులర్ షోలు వుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 300 థియేటర్స్ లో సినిమాని ప్రదర్శిస్తున్నాం. రీరిలీజ్ లో ఒక సినిమాని కోటి రూపాయిలకి అడిగినా దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఈ సినిమాని రిలీజ్ చేస్తామని చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్, ఎక్సిభిటర్స్  కోటి రుపాయిలకి అడగడం చెన్నకేశవ రెడ్డి’ క్రేజ్ కి నిదర్శనం. సినిమాని సరికొత్తగా డిఐతో పాటు 5.1 హంగులతో తీర్చిదిద్దాం. ఈ సినిమాకి వచ్చే రెవెన్యూలో 75 శాతం బాలకృష్ణ గారి బసవతారకం ట్రస్ట్ కి, మిగతాది నాకు సంబధించిన అసోషియేషన్స్ కి ఇవ్వాలని నిర్ణయించాం. నవంబర్ నుండి మళ్ళీ యాక్టివ్ గా ప్రొడక్షన్ మొదలుపెట్టాలని అనుకున్నాను. కానీ సెప్టెంబర్ లో ‘చెన్నకేశవ రెడ్డి’ రీరిలీజ్ తో గొప్ప ఎనర్జీ వచ్చింది. కమర్షియల్ గా కాకుండా మంచి ఉద్దేశం కోసం ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులు, అభిమానులు ఈ మంచి ఉద్దేశంలో భాగమై ఆదరించాలి'' అని కోరారు వివి వినాయక్ మాట్లాడుతూ.. కొన్నిసార్లు అనుకోకుండా ఆనందం వస్తుంది. అలాంటి ఆనందం ఇచ్చింది ‘చెన్నకేశవ రెడ్డి’. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నపుడు కొన్నిగంటలు మాత్రమే నిద్రపోయాను. బాలయ్య గారిని ఎలా ప్రజంట్ చేయాలనే పిచ్చితోనే వుండేవాడిని. అప్పటికి రెండో సినిమానే చేస్తున్న నాకు బాలయ్య గారు ఎంతో మర్యాద ఇచ్చారు. ఆయన మర్యాద మర్చిపోలేను. ఈ సినిమాకి పని చేసినందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. బాలయ్య గారితో పని చేయడం మర్చిపోలేని అనుభూతి. బాలయ్య బాబు గారికి ఎన్నో సూపర్ హిట్లు వున్నాయి. కానీ ఈ సినిమాని ఎక్కువగా ఓన్ చేసుకున్న బాలయ్య బాబు అభిమానులకు కృతజ్ఞతలు. ఈ సినిమానే రిరిలీజ్ చేయాలని అభిమనులు పట్టుబట్టారు. చాలా మంచి ఉద్దేశం కోసం ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాలో వచ్చే మేజర్ రెవెన్యు బసవతారకం ట్రస్ట్ కి విరాళంగా ఇస్తున్నాం. ఇరవై ఏళ్ల క్రితం ఒక పండగలా ఈ సినిమాని విడుదల చేశాం. ఇప్పుడు కూడా రిరిలీజ్ లా లేదు. కొత్త సినిమా రిలీజ్ చేసినట్లే అనిపిస్తుంది. మంచి ఉద్దేశం కోసం రీరిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, అభిమానులు ఆదరించాలి'' అని కోరారు.

3 years ago

Shibasish Sarkar Elected President of the Producers Guild of India

Shibasish Sarkar was unanimously elected as President of the Producers Guild of India (“Guild”) at the first meeting of its…

3 years ago

పరిశ్రమలో హాట్ టాపిక్ గా మంచి మనసులు

సినీ నటులు బండ్ల గణేష్, శివాజీ రాజా చేసిన పని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి 30 ఏళ్ల స్నేహం ఒక…

3 years ago

“ఆర్ఆర్ఆర్” సినిమా కు అన్యాయం జరిగింది

తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు..వై.కాశీ విశ్వనాథ్ "ఆర్ఆర్ఆర్" సినిమాని ఆస్కార్ కి.. నామినేట్ చేయకపోవడం అన్యాయమని సినీ దర్శకుడు, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు,…

3 years ago