వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో నాగశౌర్య విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
‘కృష్ణ వ్రింద విహారి’ కథ ఎప్పుడు విన్నారు .. ?
‘కృష్ణ వ్రింద విహారి’ కథ 2020 కోవిడ్ ఇంకా మొదలవ్వకముందే విన్నాను. కథ వినగానే నచ్చేసింది. వెంటనే సినిమాని చేస్తానని దర్శకుడితో చెప్పా. మంచి ఫన్, ఎంటర్ టైమెంట్, ఫ్యామిలీ, మాస్..ఇలా అందరికీ కావాల్సిన ఎలిమెంట్స్ వున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీతో రిలేట్ చేసుకుంటారు. ‘కృష్ణ వ్రింద విహారి’ ఎవర్ గ్రీన్ కథ. కుటుంబం ఉన్నంతవరకూ ఇలాంటి కథలకు తిరుగులేదు.
పాదయాత్ర అనుభవం ఎలా వుంది ? ఆరోగ్యంపై ప్రభావం పడిందా ?
ఆరోగ్యం కొంచెం తేడా కొట్టింది. అయితే అది పాదయాత్ర కంటే సినిమా రిలీజ్ ఒత్తిడి వలన అని భావిస్తాను. నా కెరీర్ లో ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. పాదయాత్రలో ప్రేక్షకుల అభిమానం చూస్తే నిజంగా ఒక వరం అనిపించింది. పాదయాత్రలో చాలా నేర్చుకున్నాను.
బ్రాహ్మణ పాత్రలతో అదుర్స్, డిజే, ఇటివల అంటే సుందరానికీ వచ్చాయి కదా.. ఇందులో ఎలా వుండబోతుంది ?
అదుర్స్ , డిజే, అంటే సుందరానికీ,.. ఇలా ఎన్నో సినిమాల్లో బ్రాహ్మణ పాత్ర వున్నమాత్రాన పాత్రలు, కథలు ఒకటి కాదు. దేనికదే భిన్నమైనది. ‘కృష్ణ వ్రింద విహారి’ కూడా భిన్నమైన కథ.
ఇందులో పాత్రల వినోదం ఎలా వుంటుంది ?
నాతొ పాటు ఇందులో వున్న అందరి పాత్రలో వినోదం వుంటుంది. రాధిక గారి పాత్ర తప్పితే మిగతా పాత్రలన్నీ హిలేరియస్ గా వుంటాయి. అనీష్ మంచి కామెడీ టైమింగ్ వున్న దర్శకుడు. ఇందులో సెకండ్ హాఫ్ నాకు చాలా నచ్చింది. అలాగే రాధిక గారు పాత్ర ఇందులో చాలా కీలకం. రాధిక గారితో నటించడం గొప్ప అనుభవం. రాధిక గారు బిజీగా వుండి ప్రమోషన్స్ కి రాలేకపోయారు. సక్సెస్ మీట్ కి వస్తారని భావిస్తున్నాను.
రొమాంటిక్ కామెడీలని సౌకర్యంగా భావిస్తారా ?
నిజంగా రొమాంటిక్ కామెడీలు చేసినప్పుడు అంత సౌకర్యంగా ఫీలవ్వను. రొమాంటిక్ సీన్స్ లో నేను చాలా వీక్(నవ్వుతూ) నందిని రెడ్డిగారిని అడిగినా ఇదే చెప్తారు. మా దర్శకుడు చాలా కష్టపడి జాగ్రత్తగా ఇందులో చేయించారు.
ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ప్రీపేర్ అయ్యారా ?
కమల్ హాసన్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా చాలా పెద్ద స్టార్లు బ్రహ్మణ పాత్రలలో అద్భుతంగా నటించారు. ఈ పాత్ర చేస్తున్నపుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. నాకు బాగా తెలిసిన అవసరాల శ్రీనివాస్ బ్రహ్మిన్ కావడం వలన ఆయనకి తెలియకుండానే ఆయన దగ్గర నుండి కొన్ని చేర్చుకున్నాను.
షిర్లీ సెటియా హీరోయిన్ గా తీసుకోవడం ఎవరి ఛాయిస్ ?
షిర్లీ సెటియా చేసిన ఒక సినిమాని చూశాం. నచ్చింది. దర్శకుడికి చెప్పాం. ఆయనకి కూడా నచ్చడంతో ప్రాజెక్ట్ లోకి వచ్చింది. చాలా మంచి నటి.
మహతి సాగర్ మ్యూజిక్ గురించి ?
సాగర్ తో నాకు స్పెషల్ బాండింగ్ వుంది. నాకు చాలా మంచి మ్యూజిక్ ఇస్తాడు. ఇందులో మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది.
మాస్ సినిమాలు చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉందా ?
ఒక నటుడిగా అన్ని రకాల సినిమాలు చేయాలి, అన్ని జోనర్స్ లో ప్రతిభని నిరూపించుకోవాలని వుంటుంది. క్లాస్ సినిమాలు విజయాలు ఇచ్చాయనే వాటికే పరిమితం కాకూడదు కదా. మాస్ సినిమాలు కూడా ప్రయత్నిస్తాను.
పాన్ ఇండియా అలోచలు ఉన్నాయా ?
మంచి కథ రావాలి. కథ లేకుండా ఏం చేయలేం. నిజానికి మంచి కంటెంట్ వున్న సినిమా తీస్తే పాన్ వరల్డ్ చూస్తారని నమ్ముతాను. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు డామినేటింగ్ గా వుంది. ఇలాంటి సమయంలో మేము ఈ ఇండస్ట్రీలో వుండటం అదృష్టంగా భావిస్తున్నా.
కొత్తగా చేయబోతున్న సినిమాలు
ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి షూటింగ్ పూర్తయ్యింది. విడుదల గురించి త్వరలోనే చెబుతా.
అల్ ది బెస్ట్ ..
థాంక్స్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…