Faria Abdullah

‘రావణాసుర’ నుంచి మాస్ పార్టీ సాంగ్ డిక్కా డిష్యూం విడుదల

Masmaharaja Ravi Teja, Sudhir Verma, Abhishek Pictures, Art Team Works 'Ravanasura' Mass Party Song Dikka Released

2 years ago

‘రావణాసుర’ నెక్స్ట్ లెవల్ ఎక్స్పీరియన్స్:ఫరియా అబ్దుల్లా

'Ravanasura' Next Level Experience : Faria Abdullah Mass Maharaja Ravi Teja's most awaited movie 'Ravanasura'.

2 years ago

మాస్ మహారాజా రవితేజ  “రావణాసుర” టీజర్ మార్చి 6న విడుదల

వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ “రావణాసుర” లో కనిపించనున్నాడు. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డైరెక్టర్ సుధీర్ వర్మ షూటింగ్ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టీజర్ ను మార్చి 6వ తేదీన ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రవితేజ ట్రెండీగా, క్రూయల్ లుక్ లో కనిపిస్తున్న ఇంటెన్స్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ అనౌన్సుమెంట్ చేశారు. భారీ నిర్మాణ విలువలతో రావణాసుర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుండి వచ్చిన రెండు పాటలు టెర్రిఫిక్ రెస్పాన్స్ తో మిలియన్స్ వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో ఉన్నాయి. శ్రీకాంత్ విస్సా యూనిక్ కథని అందించారు, సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్ తో కథనంలో కొన్ని ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. సమ్మర్లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్ లో ఒకటైన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. తారాగణం: రవితేజ, సుశాంత్, శ్రీరామ్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు. సాంకేతిక సిబ్బంది: స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, RT టీం వర్క్స్ కథ & సంభాషణలు: శ్రీకాంత్ విస్సా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో DOP: విజయ్ కార్తీక్ కన్నన్ ఎడిటర్: నవీన్ నూలి ప్రొడక్షన్ డిజైనర్: DRK కిరణ్ సీఈఓ: పోతిని వాసు…

2 years ago

Like Share & Subscribe🔔 Trailer | Santosh Shobhan, Faria Abdullah | Merlapaka Gandhi

https://www.youtube.com/watch?v=Yi3yBF_Erng&ab_channel=NiharikaEntertainment

2 years ago

‘లచ్చమమ్మో’ సాంగ్ విడుదల లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ నుండి.

ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధమైయింది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ''లచ్చమమ్మో' వీడియో సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. ప్రవీణ్ లక్కరాజు ఈ పాటనీ ట్రెండీ ఫోక్ సాంగ్ గా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంది. గోరేటి వెంకన్న ఈ పాటకు సాహిత్యం అందించగా రామ్ మిరియాల తనదైన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా కెమిస్ట్రీ అలరిస్తోంది. పాటలో కలర్ ఫుల్ అండ్ ప్లజంట్ బీచ్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్ సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ నిర్మాత: వెంకట్ బోయనపల్లి బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంగీతం: ప్రవీణ్ లక్కరాజు డీవోపీ: వసంత్ ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్) పీఆర్వో: వంశీ-శేఖర్

2 years ago

సంతోష్ శోభన్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ ట్రైలర్‌ను లాంచ్

ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా…

2 years ago

‘రావణాసుర’ ఏప్రిల్ 7, 2023న విడుదల

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యునిక్ యాక్షన్ థ్రిల్లర్‌ రావణాసుర. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్,  ఆర్ టి టీమ్‌వర్క్స్‌ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. ఇందులో హీరో సుశాంత్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.దీపావళి పండుగ సందర్భంగా సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 7,2023న వేసవిలో రావణాసుర సినిమా థియేటర్లలో గ్రాండ్‌ గా విడుదల కానుంది. క్యారికేచర్‌గా రూపొందించిన అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రవితేజ సిగరెట్ తాగుతూ ఇంటెన్స్ గెటప్‌ లో కనిపించారు. సుధీర్ వర్మ, రవితేజను గతంలో ఎన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నారు. యాక్షన్‌ హైలైట్‌గా ఉండేలా సినిమాలో రవితేజ లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌ తో కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా,  శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు. సాంకేతిక విభాగం దర్శకత్వం: సుధీర్ వర్మ నిర్మాత: అభిషేక్ నామా బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి  టీమ్‌వర్క్స్ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్ ఎడిటర్: శ్రీకాంత్ ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్కే కిరణ్ సీఈఓ: పోతిని వాసు మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు పీఆర్వో: వంశీ-శేఖర్

2 years ago

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా “లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్” టీజర్ లాంచ్ చేసిన హీరో నితిన్

దర్శకుడు మేర్లపాక గాంధీ హిలేరియస్ ఎంటర్‌ టైనర్‌ లను డీల్ చేయడంలో దిట్ట. ఆయన తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కంప్లీట్ ఎంటర్‌ టైనర్. దీంతో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. సంతోష్ సూపర్‌హిట్ 'ఏక్ మినీ కథ' కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్‌ప్లే అందించిన సంగతి తెలిసిందే. తాజాగా లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ టీజర్‌ ను హీరో నితిన్ లాంచ్ చేశారు. సంతోష్ శోభన్ తన స్నేహితుడైన కెమెరామెన్ నెల్లూరు సుదర్శన్‌తో కలిసి అందమైన ప్రదేశాలకు ప్రయాణించి ట్రావెల్ బ్లాగర్‌ గా మారాలనుకుంటున్నాడు. సంతోష్ ప్రయాణంలో అందమైన అమ్మాయి ఫరియా అబ్దుల్లాను కలుస్తాడు. ఆమెను ఫ్లిర్ట్ చేయాలని ప్రయత్నిస్తాడు. హిలేరియస్ గా సాగుతున్న టీజర్ సెకండాఫ్‌లో సినిమా క్రైమ్ పార్ట్ చూపించడం క్యురియాసిటీని పెంచింది. క్రైమ్, కామెడీ చాలా ఎక్సయిటింగ్ కాంబినేషన్. టీజర్ ప్రామిసింగ్ గా వుంది. మేర్లపాక గాంధీ రొమాన్స్ తో పాటు  క్రైమ్, కామెడీ అంశాలను కలిగి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందిందని టీజర్‌ ద్వారా తెలుస్తోంది. పక్కింటి అబ్బాయిలా కనిపించిన సంతోష్ శోభన్ కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉంది. టీజర్‌లో ఫరియా అబ్దుల్లా అందంగా కనిపించింది. నెల్లూరు సుదర్శన్‌ది సంతోష్‌ తో పాటు ప్రయాణించే కీలక పాత్ర. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫన్నీగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా అలరించిన టీజర్ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది. బ్లాక్ బస్టర్ హిట్ 'శ్యామ్ సింగరాయ్‌' ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుందని మేకర్స్ ట్రైలర్‌ ద్వారా తెలియజేశారు.  తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్ సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ నిర్మాత: వెంకట్ బోయనపల్లి బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంగీతం: ప్రవీణ్ లక్కరాజు డీవోపీ: వసంత్ ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్) పీఆర్వో: వంశీ-శేఖర్

2 years ago

Nithiin Launched Teaser Of Like Share & Subscribe

Director Merlapaka Gandhi is an expert in dealing hilarious entertainers and his next Like Share & Subscribe is also a…

2 years ago