మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర‘ షూటింగ్ ఈరోజుతో పూర్తి కానుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో రవితేజ, హీరోహీరోయిన్లపై వేసిన భారీ సెట్‌లో శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. సుధీర్ వర్మ పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్ల షూటింగ్ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చేసింది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రావణాసురు వేసవిలో విడుదలయ్యే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఫస్ట్ గ్లింప్స్ రవితేజ పాత్రని విభిన్న షేడ్స్ లో చూపించగా, థీమ్ నెంబర్, రెండవ సింగిల్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.
సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్.
శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.
ఏప్రిల్ 7, 2023న రావణాసుర ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.
సాంకేతిక విభాగం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్
కథ, & డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్ కె కిరణ్
సీఈఓ: పోతిని వాసు
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు
పీఆర్వో: వంశీ-శేఖర్
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…