ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధమైయింది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ”లచ్చమమ్మో’ వీడియో సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. ప్రవీణ్ లక్కరాజు ఈ పాటనీ ట్రెండీ ఫోక్ సాంగ్ గా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంది.
గోరేటి వెంకన్న ఈ పాటకు సాహిత్యం అందించగా రామ్ మిరియాల తనదైన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా కెమిస్ట్రీ అలరిస్తోంది. పాటలో కలర్ ఫుల్ అండ్ ప్లజంట్ బీచ్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
డీవోపీ: వసంత్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో: వంశీ-శేఖర్
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…