Renowned cinematographer Andrew Babu, who has served as Director of Photography on 34 films across five languages, is making his…
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్,…
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ‘రావణాసుర’ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ .. దర్శకుడితో మాంచి సింక్ లో వుండి ప్రతి సెట్ చాలా అద్బుతంగా వేశారు. డివోపీ విజయ్ కన్నన్ ఎక్స్ టార్డినరీగా చేశారు. రెండు పాటలు చేసిన జికే విష్ణు, దివాకర్ మణి, ప్రసాద్ మురెళ్ళకి థాంక్స్. వెంకట్, శివ ఫైట్స్ ఇరగదీశారు. మా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ ఎక్స్ లెంట్ గా చేశారు. ఈ సినిమా మ్యూజిక్ కి స్పెషల్ ఎప్పిరియన్స్ భీమ్స్. నాకు ఇష్టమైన టెక్నిషియన్. ఈ సినిమాకి హర్ష వర్ధన్.. అద్భుతమైన సౌండ్ ఇచ్చాడు. మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. రైటర్ శ్రీకాంత్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్ళాలి. తనతో టైగర్ నాగేశ్వర్ చేస్తున్నాను. రోజ్ డ్యాన్స్ లని చాలా ఎంజాయ్ చేస్తారు. మేఘా, దక్ష, పూజిత, అను, ఫారియా .. హీరోయిన్స్ అంతా పర్ఫెక్ట్ గా చేశారు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఆది తో నాకు మంచి టైమింగ్ కుదిరింది. ఈ కాంబినేషన్ కి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని కోరుకుంటున్నాను. మా ఎడిటర్ నవీన్ నూలి.. సినిమా చూసి మొదట చెప్పాల్సింది వాళ్ళే. ఈ సినిమా గురించి చాలా బాగా చెప్పాడు. చాలా నమ్మకంగా వున్నాం. ఈ సినిమా అందరినీ ఎంతగానో అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఏప్రిల్ 7న విజల్స్ పడతాయి. మా ఆర్టీ టీం వర్క్ శ్వేతా, వ్రిందా, నమ్రత.. ఆర్టీ టీం వర్క్ బ్యాక్ బోన్స్. అభిషేక్ నామా ని మేము క్యూట్ బాయ్ అంటాం. రావణాసుర టైటిల్ కూడా అతనిదే. టైటిల్ డిజైన్స్ కూడా తనవే. తను మల్టీ టాలెంటెడ్. ఈ సినిమా పెద్ద హిట్ అయి మా ఇద్దరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా బావుంటుంది. నిర్మాతలుగా మాకు మంచి కాంబినేషన్ ఏర్పడుతుందని భావిస్తున్నాను. సుశాంత్ చాలా సాఫ్ట్ పర్శన్. తనతో చేసిన ప్రతి సీను ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో తనది ఎక్స్ లెంట్ క్యారెక్టర్. చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాతో కొత్త సుశాంత్ ని చూడబోతున్నారు. సుధీర్ వర్మ నాకు ఇష్టమైన డైరెక్టర్. చాలా స్వీట్ అండ్ పాజిటివ్ పర్శన్. సుధీర్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. ఏప్రిల్ 7 థియేటర్స్ లో ఇరగదీసేద్దా. మాములుగా వుండదు. సౌండ్ దద్దరిల్లుతుంది. ప్రేక్షకులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు. జై సినిమా’’ అన్నారు. సుశాంత్ మాట్లాడుతూ.. అభిషేక్ గారికి థాంక్స్. శ్రీకాంత్ గారు కథ చెప్పినప్పుడే రవితేజ గారిని ఇలా ఎప్పుడూ చూడలేదు, చాలా బావువుందని చెప్పాను. మాస్ మహారాజాని ఎప్పుడూ ఇలా చూసి వుండరు. సుధీర్ గారు అద్భుతమైన డైరెక్టర్. హీరోయిన్స్ అంతా చక్కగా చేశారు. టెక్నిషియన్స్ అందరికి కృతజ్ఞతలు. రవితేజ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయనతో పని చేయడం చాలా ఎంజాయ్ చేశాను’’ అన్నారు. దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా స్వామి రారా తర్వాత నాకు వచ్చిన మొదటి ఫోన్ కాల్ రవితేజ గారిది. ఆప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలని అనుకున్నా కుదరలేదు.ఒకసారి ఫోన్ చేసిన శ్రీకాంత్ కథ చెప్పాడు విను అన్నారు. అద్భుతమైన కథ. ఇంత మంచి కథ డైరెక్ట్ చేయడానికి నన్ను ఎంచుకోవడం అనందంగా వుంది. హీరోయిన్స్ అందరూ అద్భుతంగా చేశారు. రవితేజ గారు ఎప్పుడూ ఎక్స్ టార్డినరీగా చేస్తారు. ఈ సినిమాలో థ్రిల్ అవుతారు, షాక్ అవుతారు. ఇందులో సుశాంత్ మరో సర్ప్రైజ్. ఆయన్ని కొత్తగా చూపించానని భావిస్తున్నాను. శ్రీకాంత్ అద్భుతమైన కథ ఇచ్చారు. హర్ష వర్ధన్, బీమ్స్, విజయ్, శీను.. టెక్నికల్ టీం, ప్రొడక్షన్ టీం అందరికీ కృతజ్ఞతలు ‘’ తెలిపారు. నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. ఈ వేడుక చూస్తుంటే 50 రోజుల పండగలా వుంది. ఏప్రిల్ 7 తర్వాత .. ఇక్కడే యాభై రోజుల పండగ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’’ అన్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ.... నాకు ఇంతపెద్ద అవకాశం ఇచ్చిన రవితేజ గారికి, నిర్మాతకు, దర్శకుడు సుధీర్ వర్మ గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు. భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. రవితేజ గారు నన్ను తలెత్తుకునేలా చేశారు. ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రవితేజ గారితో పని చేయడం అంటే ఆయన అభిమానులతో కలసి పని చేయడం లాంటింది. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’’ తెలిపారు. పూజిత మాట్లాడుతూ.. ‘రావణాసుర’ నాకు చాలా స్పెషల్ మూవీ. రవితేజ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. దర్శక నిర్మాతలకు, నటీనటులందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న అందరూ ‘రావణాసుర’చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. దక్ష మాట్లాడుతూ...అభిషేక్ పిక్చర్స్ నాకు హోం బ్యానర్ లా అనిపిస్తుంది. సుధీర్ వర్మ గారితో పని చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. రవితేజ గారి లాంటి గ్రేట్ కోస్టార్ తో పని చేయడం నాకు ఇదే మొదటి. టీం అందరికీ థాంక్స్. మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. రవితేజ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. యాక్టింగ్ డ్యాన్సింగ్, కామిక్ టైమింగ్ సెన్స్ అఫ్ హ్యుమర్ ఇలా చాలా విషయాలు వున్నాయి. రవితేజ గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇలాంటి యూనిక్ ఫిల్మ్ లో భాగం అయినందుకు చాలా ఆనందంగా వుంది. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఎస్కేఎన్ మాట్లాడుతూ.. రవితేజ గారు కేవలం ప్రతిభని నమ్మే వ్యక్తి. ఈ ట్రైలర్ చూస్తుంటే ఆయన పాత రికార్డులన్నీ బద్దలుగొట్టేలా వుంది. సుశాంత్ గారికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు. వంశీ మాట్లాడుతూ.. రవితేజ గారితో పని చేస్తున్నపుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు నేను గెలవాలి అనరు. మనం గెలవాలి అంటారు. నేనుండాలి అనరు. మనం వుండాలి అంటారు. అది గొప్ప లక్షణం. సుధీర్ వర్మ థ్రిల్లర్ అద్భుతంగా తీశారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు. సురేష్ బాబు మాట్లాడుతూ.. రవితేజకి అభినందనలు. తను ఎనర్జిటిక్ పర్శన్. దర్శకుడు సుధీర్ వర్మ, నిర్మాతలు, సుశాంత్, హీరోయిన్స్, అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. నా లాంటి దర్శకులు ఇండస్ట్రీలో వున్నారంటే దానికి కారణం మాస్ మహారాజ రవితేజ. ఆయనతో మూడు సినిమాలు తీశాను. మనం ఒకటి అడిగితే నాలుగు వేరియేషన్స్ ఇచ్చే హీరో రవితేజ. డాన్ శీను సమయంలో రాజమౌళి గారు స్వయంగా ఈ మాట చెప్పారు. పరిశ్రమలో నాకు అన్నయ్య రవితేజ. రావణాసుర ట్రైలర్ ఎక్స్ టార్డినరిగా వుంది. సుధీర్ వర్మ అద్భుతమైన టెక్నిషియన్. మంచి టీం ఎక్స్ టార్డినరిగా తీశారు. సుశాంత్ కి ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమాలో చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు. హనురాఘవపూడి మాట్లాడుతూ.. రవితేజ గారికి నిజంగా దండం. మొన్న వాల్తేరు వీరయ్యల్లో ఒకలా కనిపించారు. అంతకుముందు ధమాకాలో మరోలా కనిపించారు. ఇప్పుడు రావణాసురలో ఇంకొల కనిపిస్తున్నారు. మూడు తలలు ఇందులోనే అయిపోయాయి. ఇప్పటికే బోలెడు హ్యాట్రిక్ లు ఇచ్చారు. ఇది మరో హ్యాట్రిక్ అవుతుంది. ఇందులో సందేహం లేదు. టీజర్ ట్రైలర్ అద్భుతంగా వున్నాయి. ఈ సినిమా సుధీర్ కోసం చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్’’ చెప్పారు. వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ..రావణాసుర ట్రైలర్ చాలా నచ్చింది. రవితేజ గారికి, టీం అందరికీ ఆల్ ది బెస్ట్.సినిమా సూపర్ హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు’’ అన్నారు. హైపర్ ఆది మాట్లాడుతూ.. ప్రతిభని ప్రోత్సహించే హీరో రవితేజ. ఆయనది గొప్ప మనసు. సినిమాతో పాటు సినిమా చేసే హీరో రవితేజ గారు. ఎప్పుడూ పాజిటివ్ గా వుంటారు. ..రావణాసుర కి పది తలలు వుంటాయి. తలకి 10 కోట్లు వేసుకున్నా.. ఈ సినిమాకి వందకోట్లు గ్యారెంటీ. హ్యాట్రిక్ వందకోట్లు హిట్లు ఈ సినిమాతో రవితేజ అన్నకి సాధ్యం కాబోతుంది. సుధీర్ వర్మ గారు అద్భుతంగా తీశారు. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు…
Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Theatrical Trailer On March 28th
Masmaharaja Ravi Teja, Sudhir Verma, Abhishek Pictures, Art Team Works 'Ravanasura' Mass Party Song Dikka Released
వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ “రావణాసుర” లో కనిపించనున్నాడు. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డైరెక్టర్ సుధీర్ వర్మ షూటింగ్ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టీజర్ ను మార్చి 6వ తేదీన ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రవితేజ ట్రెండీగా, క్రూయల్ లుక్ లో కనిపిస్తున్న ఇంటెన్స్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ అనౌన్సుమెంట్ చేశారు. భారీ నిర్మాణ విలువలతో రావణాసుర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుండి వచ్చిన రెండు పాటలు టెర్రిఫిక్ రెస్పాన్స్ తో మిలియన్స్ వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో ఉన్నాయి. శ్రీకాంత్ విస్సా యూనిక్ కథని అందించారు, సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్ తో కథనంలో కొన్ని ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. సమ్మర్లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్ లో ఒకటైన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. తారాగణం: రవితేజ, సుశాంత్, శ్రీరామ్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు. సాంకేతిక సిబ్బంది: స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, RT టీం వర్క్స్ కథ & సంభాషణలు: శ్రీకాంత్ విస్సా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో DOP: విజయ్ కార్తీక్ కన్నన్ ఎడిటర్: నవీన్ నూలి ప్రొడక్షన్ డిజైనర్: DRK కిరణ్ సీఈఓ: పోతిని వాసు…
Mass Maharaja Ravi Teja Ravanasura shoot has been coHigh-intense action thriller '
Director Raju Murugan has been proving that entertainment and social responsibility can go hand in hand through his films which…
మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యునిక్ యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. ఇందులో హీరో సుశాంత్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.దీపావళి పండుగ సందర్భంగా సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 7,2023న వేసవిలో రావణాసుర సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. క్యారికేచర్‌గా రూపొందించిన అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రవితేజ సిగరెట్ తాగుతూ ఇంటెన్స్ గెటప్ లో కనిపించారు. సుధీర్ వర్మ, రవితేజను గతంలో ఎన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నారు. యాక్షన్ హైలైట్‌గా ఉండేలా సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్ తో కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు. సాంకేతిక విభాగం దర్శకత్వం: సుధీర్ వర్మ నిర్మాత: అభిషేక్ నామా బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్ ఎడిటర్: శ్రీకాంత్ ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్కే కిరణ్ సీఈఓ: పోతిని వాసు మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు పీఆర్వో: వంశీ-శేఖర్
Renowned Producer Allu Aravind's own production house Geetha Arts is one of the reputed banners of Tollywood of all time.…