మాస్ మహారాజా రవితేజ- సుధీర్ వర్మల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’ భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం ఆసన్నమైంది.
మైండ్ బ్లోయింగ్ పోస్టర్ ద్వారా రావణాసుర థియేట్రికల్ ట్రైలర్‌ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. పోస్టర్‌లో రవితేజ ఫెరోషియస్ గా కనిపిస్తున్నారు. చేతులు పైకెత్తి ఒక చేతిలో తుపాకీతో ఇంటెన్స్ గా కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో న్యాయ దేవత నీడ, కోర్టు గది తగలబడిపోవడం చూడవచ్చు. రావణాసురు ట్రైలర్‌లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో హైలీ ఇంటెన్స్ ఉంటుందనే అభిప్రాయాన్ని ఈ పోస్టర్ కలిగిస్తోంది.
ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా యూనిక్ కథను అందించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్.
ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ప్రపంచ వ్యాప్తంగా రావణాసుర గ్రాండ్ రిలీజ్ కానుంది.
తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.
సాంకేతిక విభాగం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్
కథ, & డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్ కె కిరణ్
సీఈఓ: పోతిని వాసు
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…