Allari Naresh

అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మే 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల

అల్లరి నరేష్ , విజయ్ కనకమేడల టీమ్ వర్క్ తెలుగులో క్రేజీ కాంబినేషన్‌లో ఒకటిగా మారుతోంది. వీరిద్దరు కలిసి చేసిన మొదటి చిత్రం ‘నాంది’ విమర్శకుల ప్రశంసలతో…

3 years ago

సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలో 1980 నాటి మిలిటరీ హోటల్‌ రెండవ శాఖ

సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలో 1980ల నాటి మిలిటరీ హోటల్‌ రెండవ శాఖను ఘనంగా ప్రారంభించారు. సినీ హీరో విశ్వక్ సేన్, అల్లరి నరేశ్, డైరెక్టర్ అనిల్ రావుపుడి, నిర్మత…

3 years ago

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల’ఉగ్రం’ ఏప్రిల్ 14న విడుదల

అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న…

3 years ago

నవంబర్ 25న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ విడుదల

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా టీజర్‌, మెలోడీ సాంగ్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో అల్లరి నరేష్‌  గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకోని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యమౌతుంది.  నవంబర్ 11న కాకుండా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో గిరిజన ప్రాంతంలో పోలీసు అధికారులతో ప్రయాణిస్తూ విచారిస్తున్నట్లు కనిపించారు అల్లరి నరేష్.ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా,  బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్ నిర్మాత: రాజేష్ దండా నిర్మాణం: జీ స్టూడియోస్,  హాస్య మూవీస్ సహ నిర్మాత: బాలాజీ గుత్తా సంగీతం: శ్రీచరణ్ పాకాల డైలాగ్స్: అబ్బూరి రవి డీవోపీ: రాంరెడ్డి ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ స్టంట్స్: పృథ్వీ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, బిన్నీ డిఐ - అన్నపూర్ణ స్టూడియోస్ పీఆర్వో: వంశీ-శేఖర్

3 years ago

‘ఉగ్రం’ కథానాయికగా మిర్నా మీనన్

హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రెండో చిత్రంగా 'ఉగ్రం' తెరకెక్కుతోంది. ఇటివల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ క్యూరియాసిటీ పెంచింది.  ఫస్ట్ లుక్‌ లో అల్లరి నరేష్ శరీరం నిండా గాయాలతో ఫెరోషియస్ గా కనిపించాడు, లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో కథానాయికగా మిర్నా మీనన్ ని ఎంపిక చేశారు. మిర్నా ఇంతకుముందు మోహన్ లాల్ బిగ్ బ్రదర్‌ తో పాటు తమిళం,  మలయాళ సినిమాలలో నటించింది. తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా. తన తొలి చిత్రాన్ని విలక్షణమైన కథతో తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కనకమేడల ఉగ్రం కోసం పవర్ ఫుల్ కథను సిద్దం చేశారు. ఇందులో నరేష్ ని చాలా డిఫరెంట్ రోల్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. తారాగణం: అల్లరి నరేష్, మిర్నా మీనన్ సాంకేతిక విభాగం : రచన, దర్శకత్వం: విజయ్ కనకమేడల నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది బ్యానర్: షైన్ స్క్రీన్స్ కథ: తూము వెంకట్ డైలాగ్స్: అబ్బూరి రవి డీవోపీ: సిద్ సంగీతం: శ్రీచరణ్ పాకాల ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి పీఆర్వో:  వంశీ-శేఖర్

3 years ago

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల ‘ఉగ్రం’ ఫస్ట్ లుక్ విడుదల

హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన 'నాంది' చిత్రం కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖ్యంగా అల్లరి…

3 years ago