‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ సినిమా రివ్యూ

Must Read

శ్రీరాముల వారి చరిత్ర ఎంత గణనీయమైనదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి రామాయణాన్ని రచించిన వాల్మీకి కూడా తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు. రామాయణాన్ని ఎవరు చిత్రీకరించిన ఎంతో ప్రేమగా ఆ చిత్రాన్ని ఆస్వాదిస్తారు ప్రేక్షకులు అలాగే రాముడు వారి భక్తులు. అదేవిధంగా ఇప్పుడు జపనీస్ కూడా మన రామాయణాన్ని చిత్రీకరించడం విశేషం అని చెప్పాలి. సుమారు 31 సంవత్సరాల క్రితం జపనీస్ నుంచి ఒక యానిమేషన్ ఫిలిం కా రామాయణాన్ని ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ జపాన్ కు చెందిన కోయిచి ససకి, యుగో సాకి అలాగే భారతదేశానికి చెందిన రామ్ మోహన్ కలసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు చాలాకాలం తర్వాత గ్రీక్ పిక్చర్స్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్, ఏ ఏ ఫిలిమ్స్ సంయుక్తంగా ఇండియాలో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో జనవరి 24వ తేదీన విడుదల చేయడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలు చూద్దాం.

కథ:
వాల్మీకి రచించిన రామాయణం అత్యద్భుతం, అతి మనోహరం. ఇప్పుడు అదే రామాయణాన్ని జపాన్లో అది కూడా యానిమేషన్ స్టైల్ లో రూపొందించారు. ప్రత్యేకించి ఈ సినిమాలో శ్రీరాముల వారు 15 సంవత్సరాల వయసు నుంచి రామ రావణుని యుద్ధం, పట్టాభిషేకం వరకు ఏదైతే జరిగిందో దానిని కళ్ళకు కట్టినట్లుగా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందించారు. శ్రీరాములవారు 14 సంవత్సరాలు వనవాసం చేయడం, దశరథ మహారాజు మరణించడం, రావణుడు సీతాదేవిని అపహరించడం, హనుమంతుడు లంకకు వెళ్లి యుద్ధాన్ని మొదలుపెట్టడం, రామ రావణుని మధ్య జరిగిన యుద్ధం ఇవన్నీ కూడా అత్యద్భుతంగా యానిమేషన్ రూపంలో చాలా చక్కగా చూపించారు.

విశ్లేషణ:
రాములవారి కథ ఎన్నిసార్లు విన్న చూసిన కానీ మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఒక మంచి గాధ. అట్టి గొప్ప రామాయణాన్ని మన భారతదేశంలో ఎంతో పుణ్య కథగా అందరూ భావిస్తారు. ప్రస్తుతం జపనీస్ అనిమేషన్ స్టైల్లో రూపుదిద్దుకున్న ఈ రామాయణం కూడా అంతే ప్రత్యేకంగా ఉంది. ఈ చిత్రాన్ని 1993లో చిత్రీకరించడం జరిగింది. సాధారణంగా చెప్పాలి అంటే అప్పట్లో గ్రాఫిక్స్ అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. మరి అలాంటి సమయంలో ఇంత గొప్ప సినిమాను అది కూడా విభిన్నమైన గ్రాఫిక్స్ అలాగే యానిమేషన్స్ తో ఇంత చక్కగా చూపించడం విశేషం అని చెప్పాలి. కొన్ని కారణాలవల్ల 31 సంవత్సరాల తర్వాత విడుదల చేసిన ఈ సినిమా ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సినిమాని ఇప్పుడు 4k లో విడుదల చేయడం జరిగింది.

సారాంశం:
ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మన పాశ్చాత్య సాంప్రదాయాలు, విలువలు ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. అందులోనూ రామాయణం అంటే ఒక గొప్ప కథ. మంచి, చెడు ఇవన్నీ సమపాలల్లో తెలియాలి అంటే కచ్చితంగా రామాయణం తెలిసి ఉండాలి. పిల్లలు సైతం చూసే విధంగా ఇప్పుడు విడుదల చేసిన ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ఉంది. కాబట్టి బంధుమిత్ర సపరి వార సమేతంగా చూడదగ్గ సినిమాగా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Latest News

Beauty Lovely Teaser Unveiled On Valentine’s Day

Vanara Celluloid is making waves in the film industry with its bold move into film production, kicking off with...

More News