ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకుని తీసిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. స్మరణ్ సాయి సంగీతం సమకూర్చారు.
కథ విషయానికొస్తే :
హైదరాబాదులో స్లమ్ ఏరియాలో ఉండే ఒక మధ్య తరగతి కుటుంబం. లక్ష్మణ్ (వినోద్ కిషన్) బీటెక్ చదువుకుని కూడా ఈజీ గా డబ్బు సంపాదించాలనుకుంటాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేస్తాడు. తన భార్య వరలక్ష్మి (అనూష కృష్ణ) కర్రీ పాయింట్ పెట్టుకుని కష్టపడి ఎదుగుదామనుకుంటుంది. లక్ష్మణ్ నుంచి ఇంటికి ఎలాంటి సపోర్ట్ ఉండదు. పేకాట ఆడుతూ అప్పులు చేసి తన కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెడతాడు. అనుకోని పరిస్థితుల్లో లక్ష్మణ్ కి శ్వేత (రితిక శ్రీనివాస్) పరిచయం అవుతుంది. అక్కడ నుంచి తన కుటుంబంలో అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. అసలు శ్వేతా కి లక్ష్మణ్ కి సంబంధం ఏంటి? వరలక్ష్మి తను అనుకున్నది సాధించిందా లేదా? చివరికి లక్ష్మణ్ మారి వరలక్ష్మికి సపోర్ట్ ఇచ్చాడా లేక లత్కోర్ లక్ష్మణ్ గా మిగిలిపోయాడు? తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే.
నటీనటుల విషయానికొస్తే :
లక్ష్మణ్ పాత్రలో వినోద్ కిషన్ ఒదిగిపోయాడు. కన్నింగ్ క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. ఇక వరలక్ష్మిగా మధ్యతరగతి భార్యగా అనూష కృష్ణ పాత్రకి నూటికి నూరు మార్కులు పడ్డాయి. ఎన్ఆర్ఐ గా ఇండియాకి వచ్చిన పాత్రలో రితిక శ్రీనివాస్ బాగా నటించారు. మిగిలిన వారు తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
టెక్నికల్ ఆస్పెక్ట్స్ :
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ నిర్మాత రాకేష్ వర్రే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా నిర్మించారు. స్మరణ సాయి ఇచ్చిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ బాగున్నాయి. డిఓపి హరిచరణ్ కె. పనితీరు అద్భుతం. సృజన అడుసుమిల్లి, హంజా అలీ ఎడిటింగ్ వర్క్ బాగుంది. దర్శకుడు నీలగిరి మామిళ్ల మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ని చూపించడంలో సఫలమయ్యారు. ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్ చేసుకుని ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా బాగా చూపించారు.
ఫైనల్ వెర్డెక్ట్ : ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
రేటింగ్ : 3/5