జైద్ ఖాన్, జయతీర్థ, ఎన్‌కె ప్రొడక్షన్స్ పాన్ ఇండియా చిత్రం ‘బనారస్’ నుండి ట్రోల్ సాంగ్ విడుదల

Must Read

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు,

ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ట్రోల్ సాంగ్’ విడుదలైంది. బి. అజనీష్ లోక్‌నాథ్ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ బీట్‌లతో కూడిన పార్టీ సాంగ్ ఇది. పాట చాలా హుషారుగావుంది. జాస్సీ గిఫ్ట్ వాయిస్ మరింత ఉత్సాహాన్ని తెచ్చింది.    భాస్కరభట్ల సాహిత్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి ఆసక్తికరంగా సాగింది. జైద్ ఖాన్  వండర్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రొడక్షన్స్ చాలా వైబ్రైంట్ కనిపిస్తోంది

ఈ చిత్రానికి అద్వైత గురుమూర్తి డీవోపీగా,  కెఎం ప్రకాష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్   భారీ స్థాయిలో తెరకెక్కుతున్న బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది.

తారాగణం: జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ  తదితరులు

సాంకేతిక విభాగం
రచన,  దర్శకత్వం: జయతీర్థ
నిర్మాత: తిలకరాజ్ బల్లాల్
బ్యానర్: ఎన్ కె ప్రొడక్షన్స్
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: అద్వైత గురుమూర్తి
యాక్షన్: ఎ వుయి, డిఫరెంట్ డానీ
డైలాగ్స్: రఘు నిడువల్లి
లిరిక్స్ : డా.వి.నాగేంద్రప్రసాద్
ఎడిటర్: కె ఎం ప్రకాష్
ఆర్ట్: అరుణ్ సాగర్, శీను
కొరియోగ్రాఫర్: జయతీర్థ, ఎ హర్ష
పోస్ట్ సూపర్‌వైజర్ – రోహిత్ చిక్‌మగళూరు
కాస్ట్యూమ్: రష్మీ, పుట్టరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైబి రెడ్డి
ప్రొడక్షన్ కంట్రోలర్: చరణ్ సువర్ణ, జాకీ గౌడ
పబ్లిసిటీ డిజైన్: అశ్విన్ రమేష్
పీఆర్వో : వంశీ-శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News