హృతిక్ రోష‌న్ – సైఫ్ ఆలీఖాన్ హీరోలుగా పుష్క‌ర్ – గాయ‌త్రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్  థ్రిల్ల‌ర్ ‘విక్రమ్ వేద’ టీజర్ రిలీజ్.. ట్రెమెండస్ రెస్పాన్స్

Must Read

బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోష‌న్‌, సైఫ్ ఆలీఖాన్ న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘విక్రమ్ వేద’. పుష్కర్ – గాయత్రి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 30న గ్రాండ్‌గా సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. బుధ‌వారం ఈ మూవీ టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

యాక్ష‌న్ ప్యాక్డ్ విజువ‌ల్స్‌తో ‘విక్రమ్ వేద’ ఆడియెన్స్‌కి స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. వేద పాత్ర‌లో హృతిక్ రోష‌న్‌.. విక్ర‌మ్ పాత్ర‌లో సైఫ్ ఆలీఖాన్ న‌టించారు. అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి ఎంగేజింగ్ స్టోరి న‌డిచింద‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

టీజ‌ర్ వ్య‌వ‌ధి 1 నిమిషం 46 సెకన్లుగా ఉంది. ఈ చిన్న టీజ‌ర్‌లోనే విక్ర‌మ్ వేద మ‌ధ్య జ‌రిగే క‌థా ప్ర‌పంచాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కులు. ప్రేక్ష‌కులు ఆనందంతో విజిల్స్ వేసే డైలాగ్స్‌, భారీ స్థాయిలో యాక్ష‌న్ సీక్వెన్స్‌తో ఎమోష‌న‌ల్ డ్రామాగా సినిమా రూపొందింద‌ని తెలుస్తోంది. ఈ స‌న్నివేశాల‌ను బ్యాగ్రౌండ్ స్కోర్ మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. కంప్లీట్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్యాకేజ్‌గా ‘విక్రమ్ వేద’ తెర‌కెక్కింద‌ని టీజ‌ర్‌తో క్లియ‌ర్ క‌ట్‌గా అర్థ‌మ‌వుతుంది.

హీరోలు హృతిక్ రోష‌న్‌, సైఫ్ ఆలీఖాన్‌ల‌తో పాటు సినిమాను డైరెక్ట్ చేసిన పుష్క‌ర్ – గాయ‌త్రిల‌కు సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. దీంతో సెప్టెంబ‌ర్ 30న సినిమాను థియేట‌ర్స్‌లో చూడ‌టానికి ప్రేక్షకులు మ‌రింత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

‘విక్రమ్ వేద’ చిత్రంలో ప్రేక్ష‌కులు ఊహించ‌ని ట్విస్టులు, ట‌ర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. విక్ర‌మ్ (సైఫ్ ఆలీఖాన్‌) సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ఎవ‌రికీ దొర‌క‌ని క‌రుడుగ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్ వేద (హృతిక్ రోష‌న్‌)ను ప‌ట్టుకోవ‌టానిక ప్లాన్ చేస్తుంటాడు. పిల్లి – ఎలుక‌లా ఒక‌రి వెనుక ఛేజింగ్‌లా జరిగే వీరి క‌థ‌లో విక్ర‌మ్‌కి వేద కొన్ని క‌థ‌ల‌ను చెబుతుంటాడు. వాటి ఆధారంగా విక్ర‌మ్ ఏం తెలుసుకున్నాడ‌నేదే ప్ర‌ధాన క‌థాంశం.

గుల్ష‌న్ కుమార్ సమ‌ర్ప‌ణ‌లో టీ సిరీస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ క‌లిసి ఫ్రైడే ఫిల్మ్ వ‌ర్క్స్‌, జియో స్టూడియోస్‌, వై నాట్ స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్ కాంబినేష‌న్‌తో ‘విక్రమ్ వేద’ చిత్రాన్ని  రూపొందిస్తున్నారు. పుష్క‌ర్ – గాయ‌త్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి భూష‌ణ్ కుమార్‌, ఎస్‌.శ‌శికాంత్ నిర్మాత‌లు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 30 భారీ ఎత్తున రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News