కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Must Read

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’.  మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. ఇప్పటి వరకు విడుదలైన రెండు ప్రోమోలు – ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాయి. మునుపెన్నడూ చూడని యాక్షన్ కంటెంట్, నాగార్జున సూపర్ స్టైలిష్ గా కనిపించడం సినిమాపై క్యురియాసిటీని పెంచింది. ఇప్పుడు ఆ అంచనాలని రెట్టింపు చేస్తూ థియేట్రికల్ ట్రైలర్‌ విడుదలైయింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘ది ఘోస్ట్’ ట్రైలర్‌ను విడుదల చేసి, టీమ్‌కు  బెస్ట్ విశేష్ తెలిపారు.

ట్రైలర్ ప్రధాన పాత్రలని పరిచయం చేయడంతో పాటు కథాంశంపై క్యురియాసిటీని కలిగించింది.ఇంటర్‌పోల్ ఆఫీసర్  విక్రమ్ (నాగార్జున) గ్యాంగ్‌స్టర్ల నుండి ముప్పు ఉన్న తన చెల్లలు మేనకోడలను సంరక్షిస్తానని తండ్రికి మాట ఇస్తాడు. కథాంశం, కథనం రెండూ ఆసక్తికరంగా వున్నాయి. ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ కనెక్ట్ తో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా వుంది. ప్రవీణ్ సత్తారు అందరినీ ఆకర్షించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండేలా చూసుకున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో అతని స్టైలిష్ టేకింగ్ రోలర్‌కోస్టర్ రైడ్‌ను అందిస్తోంది.

నాగార్జున తన ఫెరోసియాస్ యాక్ట్ తో ఏజెంట్ విక్రమ్‌గా పవర్-ప్యాక్డ్ ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు.  ట్రెండీ ఎటైర్ పాటు సూట్‌లు, యూనిఫామ్‌లో కూడా తనదైన ఫ్యాషన్ తో అలరించారు.నాగార్జున సబార్డినేట్‌గా కనిపించిన సోనాల్ చౌహాన్ గ్లామర్ విందు పంచారు. నాగార్జున సోదరిగా గుల్ పనాగ్ నటిస్తుండగా, మేనకోడలుగా అనిఖా సురేంద్రన్ కనిపించింది. ట్రైలర్‌లో ది ఘోస్ట్ తన ప్రధాన ఆయుధం తమహగనే వాడినట్లు చూపించారు.

ట్రైలర్ లో ప్రతి బిట్ గ్రిప్పింగ్, యాక్షన్-ప్యాక్డ్ గా మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తుంది. ఒక సీరియస్ మిషన్‌లో వున్న నాగార్జున పలికిన డైలాగ్స్ కూడా పవర్ ఫుల్ గా వున్నాయి. ఇప్పటివరకూ వున్న అంచనాలని ఈ ట్రైలర్ రెట్టింపు చేసింది.

ప్రొడక్షన్ డిజైన్ లావిష్ గా వుంది. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ ,భరత్-సౌరబ్ రీ-రికార్డింగ్ , షార్ప్ ఎడిటింగ్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు.

చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు కాగ,  భరత్, సౌరబ్ ద్వయం పాటలు అందించారు. బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు

సాంకేతిక విభాగం
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ – సౌరబ్)
యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News