రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది బర్త్‌డే బాయ్’ ఈ చిత్రాన్ని బొమ్మ బొరుసా పతాకంపై ఐ.భరత్ నిర్మిస్తున్నారు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా దర్శకుడు విస్కీ, నిర్మాత భరత్.ఐ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విస్కీ మాట్లాడుతూ
2020లో ఈ కథతో సినిమా చేద్దామని అనుకున్నాను. అయితే ఈ కథకు ఆధారమైన రియల్ ఇన్‌సిడెంట్ మాత్రం జరిగింది 2016లో. ఈ నాలుగేళ్ల గ్యాప్‌లో యూఎస్‌లోనే వుండి అక్కడ జాబ్ చేస్తూ మనీ సేవ్ చేసుకున్నాను. ఆ మనీతో ఇండియాకు వచ్చి ఈ సినిమా నా స్నేహితుడు భరత్‌తో కలిసి చేశాను. సినిమా కథ 80 శాతం వాస్తవ సన్నివేశాలు వుంటాయి. అయితే సినిమాటిక్‌గా అనించడానికి, కమర్షియల్ వాల్యూస్ కోసం ఇరవై శాతం ఫిక్షన్‌ను జోడించాను. అయితే ఫిక్షన్ కూడా నా లైఫ్‌లో వేరే సందర్బంలో జరిగిన సన్నివేశాలు యాడ్ చేశాను. సినిమా ట్రయిలర్ చూసి అందరూ సీరియస్ ఇష్యూని కామెడీగా డీల్ చేస్తున్నారా అని అడిగారు. అయితే రియల్ లైఫ్‌లో జాలీగా, హ్యపీగా వున్నా మాకు ఆ సంఘటన జరుగుతుందని అసలు తెలియదు. అయితే ఆ సంఘటన జరిగిన తరువాత ఎం జరిగింది? అనేది కథ. బర్త్‌డే బంప్స్ వల్ల ఒక స్నేహితుడు ఎలా చనిపోయాడు.. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఎంతో ఉత్కఠభరితంగా వుంటుంది. సినిమా మొదటి 15 నిమిషాలు మాత్రమే యూత్‌ఫుల్‌గా వుంటుంది. ఆ తరువాత సినిమా అంతా సీరియస్‌గానే వుంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ అన్ని రకాల ఎమోషన్స్ ఫీలవుతారు. సాధారణంగా ఒక ప్రాబ్లమ్‌లో ఇరక్కుంటే.. అమెరికాలో రూల్స్ చాలా కఠినంగా వుంటాయి. ఆ టైమ్‌లో వాళ్లు ఏం చేశారు అనేది ఆసక్తికరంగా వుంటుంది. నా ఫ్యామిలీలో ఎవరికి సినీ పరిశ్రమలోకి నేను వెళ్లడం ఇష్టంలేదు. నేను అమెరికా నుండి వచ్చిన సంగతి కూడా తెలియదు. వాళ్లను బాధ పెట్టడం ఇష్టం లేక నేను నా పేరును విస్కీగా మార్చుకున్నాను. నా ఫేస్ కనిపించకుండా మాస్క్ వేసుకుని తిరుగుతున్నాను. ఇక నాకు కోవిడ్‌లో ఎంతో ఇష్టమైన కుక్క పిల్ల చనిపోయింది. దాని పేరు విస్కీ. దాని జ్ఞాపకార్థం నా పేరును విస్కిగా మార్చుకున్నాను. చాలా సినిమాలు ప్రేక్షకులకు తెలియకుండా రిలీజై వెళుతున్నాయి. మా సినిమా అలా కాకూడదు అని వినూత్నంగా పబ్లిసిటిని చేశాం. మా బడ్జెట్‌లో కొన్ని ప్రమోషన్స్ ప్లాన్ చేశాం.ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా బాధ్యత నాదే. నాకు నచ్చింది ఇది చెబుతున్నాను. నా రెండు సినిమాలు వరుసగా సక్సెస్ కాకపోతే నేను సినిమాలు తీయడం ఆపేస్తాను. నన్ను ఆడియన్ష్ రెండు సార్లు రిజెక్ట్ చేస్తే దర్శకత్వం మానేస్తాను. నేను ఏమీ చేసినా నా సినిమాకు హెల్ప్ అయితే చాలు. అది నాకు వ్యక్తిగతంగా అవసరం లేదు’ అన్నారు.
నిర్మాత భరత్ మాట్లాడుతూ ‘ కథే ఈ సినిమా చేయడానికి రీజన్, నేను దర్శకుడు ఇద్దరం యూఎస్‌లో వుండేవాళ్లం. ఒకసారి తన లైఫ్‌లో జరిగిన ఈ సంఘటన నాకు చెప్పి సినిమా తీద్దాం అన్నాడు. అతను ఈ రియల్ కథ చెప్పగానే నేను ప్రొడ్యూస్ చేయాలని అనిపించింది. ఈ కథన నేను ఎమోషన్‌గానే ఫీల్ అయి చేస్తున్నాను. ఎమోషన్ కూడా రియల్‌స్టిక్‌గా వుండాలని
పరంగా సింక్ సౌండ్ యూజ్ చేశాం సినిమా మేకింగ్‌లో నాకు దర్శకుడికి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా అది సినిమా బెటర్‌గా రావడానికి ఉపయోగపడింది. మా ఇద్దరి కంటే ఫిల్మ్ ఈజ్ ఫస్ట్ ప్రియారిటి. ఇప్పుడు ఈ సినిమాను అమెరికాలో కూడా విడుదల చేస్తున్నాం. ఇందులో మేసేజ్ ఏమీ లేదు. జరిగిన సంఘటన చూపించి.. దీని వల్ల లైఫ్‌లు ఎలా పోయాయి అనేది చూపిస్తున్నాం. బర్త్‌డే పేరు మీద జరుగుతున్న కొన్ని వింత పోకడలు ఇందులో చూపిస్తున్నాం. మన తెలుగు, ఈ సినిమాలో మంచి లేదు, చెడు లేదు. కేవలం జరిగిన సంఘటన చూపించాం. అది ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగగా వుంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్ థ్రిల్లరే. సినిమా మొదట 15 నిమిషాలు రియల్‌గా యూత్‌ఫుల్‌గా వుంటుంది. ఆ తరువాత ప్యూర్ ఫ్యామిలీ డ్రామాలా వుంటుంది. సినిమా మొత్తం రియల్ ఇన్‌సిండెంట్ ఆధారంగా దర్శకుడు తెరకెక్కించాడు. అయితే సినిమాలో మరింత ఆసక్తి కోసం, కథలో
గ్రిప్పింగ్ కోసం కొంత ఫిక్షన్ డ్రామాను దర్శకుడు కలిపాడు. 48 గంటల్లో జరిగే కథ ఇది. తప్పకుండా ప్రతి సన్నివేశం నవ్విస్తూనే, ఉత్కంఠభరితంగా వుంటుంది. అన్నారు.
ఓంకార్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ డ్యాన్స్ షో డ్యాన్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్…
HYDERABAD – The second episode of Dance IKON Season 2: Wildfire delivered an unexpected twist,…
ఇంద్రాని దవులూరి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా అందెల రవమిది. ఈ చిత్రాన్ని శివ భట్టిప్రోలు సమర్పణలో…
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ…
Attitude Star Chandra Hass is coming up with a rustic love and action entertainer Barabar…
Santhosh Kalwacherla and Krisheka Patel play the lead roles in "Artiste", which is produced by…