నా జీవితంలో జరిగిన రియల్‌స్టోరీ ‘ది బర్త్‌డే బాయ్‌’ : దర్శకుడు విస్కీ

Must Read

ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘ది బర్త్‌డే బాయ్‌’ ఈ చిత్రాన్ని బొమ్మ బొరుసా ప‌తాకంపై ఐ.భరత్‌ నిర్మిస్తున్నారు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా దర్శకుడు విస్కీ, నిర్మాత భరత్‌.ఐ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విస్కీ మాట్లాడుతూ

2020లో ఈ కథతో సినిమా చేద్దామని అనుకున్నాను. అయితే ఈ కథకు ఆధారమైన రియల్‌ ఇన్‌సిడెంట్‌ మాత్రం జరిగింది 2016లో. ఈ నాలుగేళ్ల గ్యాప్‌లో యూఎస్‌లోనే వుండి అక్కడ జాబ్‌ చేస్తూ మనీ సేవ్‌ చేసుకున్నాను. ఆ మనీతో ఇండియాకు వచ్చి ఈ సినిమా నా స్నేహితుడు భరత్‌తో కలిసి చేశాను. సినిమా కథ 80 శాతం వాస్తవ సన్నివేశాలు వుంటాయి. అయితే సినిమాటిక్‌గా అనించడానికి, కమర్షియల్‌ వాల్యూస్‌ కోసం ఇరవై శాతం ఫిక్షన్‌ను జోడించాను. అయితే ఫిక్షన్‌ కూడా నా లైఫ్‌లో వేరే సందర్బంలో జరిగిన సన్నివేశాలు యాడ్‌ చేశాను. సినిమా ట్రయిలర్‌ చూసి అందరూ సీరియస్‌ ఇష్యూని కామెడీగా డీల్‌ చేస్తున్నారా అని అడిగారు. అయితే రియల్‌ లైఫ్‌లో జాలీగా, హ్యపీగా వున్నా మాకు ఆ సంఘటన జరుగుతుందని అసలు తెలియదు. అయితే ఆ సంఘటన జరిగిన తరువాత ఎం జరిగింది? అనేది కథ. బర్త్‌డే బంప్స్‌ వల్ల ఒక స్నేహితుడు ఎలా చనిపోయాడు.. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఎంతో ఉత్కఠభరితంగా వుంటుంది. సినిమా మొదటి 15 నిమిషాలు మాత్రమే యూత్‌ఫుల్‌గా వుంటుంది. ఆ తరువాత సినిమా అంతా సీరియస్‌గానే వుంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌ అన్ని రకాల ఎమోషన్స్‌ ఫీలవుతారు. సాధారణంగా ఒక ప్రాబ్లమ్‌లో ఇరక్కుంటే.. అమెరికాలో రూల్స్‌ చాలా కఠినంగా వుంటాయి. ఆ టైమ్‌లో వాళ్లు ఏం చేశారు అనేది ఆసక్తికరంగా వుంటుంది. నా ఫ్యామిలీలో ఎవరికి సినీ పరిశ్రమలోకి నేను వెళ్లడం ఇష్టంలేదు. నేను అమెరికా నుండి వచ్చిన సంగతి కూడా తెలియదు. వాళ్లను బాధ పెట్టడం ఇష్టం లేక నేను నా పేరును విస్కీగా మార్చుకున్నాను. నా ఫేస్‌ కనిపించకుండా మాస్క్‌ వేసుకుని తిరుగుతున్నాను. ఇక నాకు కోవిడ్‌లో ఎంతో ఇష్టమైన కుక్క పిల్ల చనిపోయింది. దాని పేరు విస్కీ. దాని జ్ఞాపకార్థం నా పేరును విస్కిగా మార్చుకున్నాను. చాలా సినిమాలు ప్రేక్షకులకు తెలియకుండా రిలీజై వెళుతున్నాయి. మా సినిమా అలా కాకూడదు అని వినూత్నంగా పబ్లిసిటిని చేశాం. మా బడ్జెట్‌లో కొన్ని ప్రమోషన్స్‌ ప్లాన్‌ చేశాం.ఈ సినిమా హిట్‌ అయినా ఫ్లాప్‌ అయినా బాధ్యత నాదే. నాకు నచ్చింది ఇది చెబుతున్నాను. నా రెండు సినిమాలు వరుసగా సక్సెస్‌ కాకపోతే నేను సినిమాలు తీయడం ఆపేస్తాను. నన్ను ఆడియన్ష్‌ రెండు సార్లు రిజెక్ట్‌ చేస్తే దర్శకత్వం మానేస్తాను. నేను ఏమీ చేసినా నా సినిమాకు హెల్ప్‌ అయితే చాలు. అది నాకు వ్యక్తిగతంగా అవసరం లేదు’ అన్నారు.

నిర్మాత భరత్‌ మాట్లాడుతూ ‘ కథే ఈ సినిమా చేయడానికి రీజన్‌, నేను దర్శకుడు ఇద్దరం యూఎస్‌లో వుండేవాళ్లం. ఒకసారి తన లైఫ్‌లో జరిగిన ఈ సంఘటన నాకు చెప్పి సినిమా తీద్దాం అన్నాడు. అతను ఈ రియల్‌ కథ చెప్పగానే నేను ప్రొడ్యూస్‌ చేయాలని అనిపించింది. ఈ కథన నేను ఎమోషన్‌గానే ఫీల్‌ అయి చేస్తున్నాను. ఎమోషన్‌ కూడా రియల్‌స్టిక్‌గా వుండాలని


పరంగా సింక్‌ సౌండ్‌ యూజ్‌ చేశాం సినిమా మేకింగ్‌లో నాకు దర్శకుడికి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా అది సినిమా బెటర్‌గా రావడానికి ఉపయోగపడింది. మా ఇద్దరి కంటే ఫిల్మ్‌ ఈజ్‌ ఫస్ట్‌ ప్రియారిటి. ఇప్పుడు ఈ సినిమాను అమెరికాలో కూడా విడుదల చేస్తున్నాం. ఇందులో మేసేజ్‌ ఏమీ లేదు. జరిగిన సంఘటన చూపించి.. దీని వల్ల లైఫ్‌లు ఎలా పోయాయి అనేది చూపిస్తున్నాం. బర్త్‌డే పేరు మీద జరుగుతున్న కొన్ని వింత పోకడలు ఇందులో చూపిస్తున్నాం. మన తెలుగు, ఈ సినిమాలో మంచి లేదు, చెడు లేదు. కేవలం జరిగిన సంఘటన చూపించాం. అది ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగగా వుంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్‌ థ్రిల్లరే. సినిమా మొదట 15 నిమిషాలు రియల్‌గా యూత్‌ఫుల్‌గా వుంటుంది. ఆ తరువాత ప్యూర్‌ ఫ్యామిలీ డ్రామాలా వుంటుంది. సినిమా మొత్తం రియల్‌ ఇన్‌సిండెంట్‌ ఆధారంగా దర్శకుడు తెరకెక్కించాడు. అయితే సినిమాలో మరింత ఆసక్తి కోసం, కథలో
గ్రిప్పింగ్‌ కోసం కొంత ఫిక్షన్‌ డ్రామాను దర్శకుడు కలిపాడు. 48 గంటల్లో జరిగే కథ ఇది. తప్పకుండా ప్రతి సన్నివేశం నవ్విస్తూనే, ఉత్కంఠభరితంగా వుంటుంది. అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News