కేజీఎఫ్ సంగీత దర్శకుడి నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా సన్సేషన్ శాసనసభ

కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవిబసుర్. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలకు రవిబసుర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక కేజీఎఫ్-2 తరువాత రవిబసుర్ సంగీతం అందిస్తున్న మరో పాన్‌ఇండియా చిత్రం శాసనసభ. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు.

తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సంగీత, నేపథ్యసంగీతం పనుల్లో సంగీత దర్శకుడు  రవిబసుర్ బిజీగా వున్నారు. ఈ చిత్రం విశేషాలను నిర్మాత షణ్ముగం సాప్పని తెలియజేస్తూ  పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవిబసుర్ అందిస్తున్న సంగీతం, నేపథ్యసంగీతం మెయిన్‌పిల్లర్‌గా వుంటుంది. ఆయనతో పనిచేయడం ఎంతో గర్వంగా వుంది.

శాసనసభ విషయంలో ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతో ఎంతో అద్బుతంగా అవుట్‌పుట్ వచ్చింది.కేజీఎఫ్-2 తరువాత తెలుగులో ఆయన నుంచి వస్తున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్ ప్రతిష్టను పెంచేవిధంగా వుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి కథ- మాటలు: రాఘవేందర్‌రెడ్డి, కెమెరా: కృష్ణమురళి. 

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago