కె విజయ భాస్కర్, గుంటూరు రామకృష్ణ, ఎస్ఆర్కే ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 నూతన చిత్ర ప్రకటన

స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల దర్శకుడు కే విజయ్ భాస్కర్ కొంత విరామం తర్వాత మెగాఫోన్ పడుతున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ  ఎస్ఆర్కే బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

విజయ భాస్కర్‌ దర్శకత్వంలోవస్తున్న 13వ చిత్రమిది. ఈ చిత్రానికి సంబధించిన నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్‌లోని మణికొండలో ఘనంగా జరిగింది. విజయ భాస్కర్, జీవిత రాజశేఖర్, కార్తికేయ నిర్మాత బొగ్గరం వెంకట శ్రీనివాస్, పారిశ్రామికవేత్త, నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ ఈ వేడుకకు హాజరై నిర్మాతకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ..రాబోవు విజయదశమి రోజున ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమౌతుందని, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఆ రోజు వెల్లడిస్తామని తెలిపారు.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఈ చిత్రం కోసం యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే కథని సిద్ధం చేశారు దర్శకులు విజయభాస్కర్.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

16 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

16 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

16 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago