`జాన‌కిరామ్ ` సెన్సార్ పూర్తి!          

  కీర్తి సురేష్‌, న‌వీన్ కృష్ణ  జంట‌గా రూపొందిన చిత్రం `జానకిరామ్`.  బేబీ శ్రేయారెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ ఓబులేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై   రాంప్ర‌సాద్  ర‌గుతు ద‌ర్శ‌క‌త్వంలో త‌మ‌టం కుమార్ రెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రం ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.


ఈ సంద‌ర్భంగా నిర్మాత త‌మ‌టం కుమార్ రెడ్డి మాట్లాడుతూ….“
ఇటీవ‌ల విడుద‌ల చేసిన మా చిత్రంలోని పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  మా చిత్రానికి సంబంధించిన సెన్సార్ ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.  హ్యుమ‌న్ ట్రాఫికింగ్ నేప‌థ్యంలో  మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన చిత్రమిది.  ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ గారి త‌న‌యుడు న‌వీన్ కృష్ణ‌ హీరోగా న‌టించాడు.  హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశాం.  అచ్చు రాజ‌మ‌ణి గారు ఏడు అద్భుత‌మైన పాట‌లు కంపోజ్ చేశారు.  మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారు కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించారు.  కీర్తి సురేష్ , న‌వీన్ కృష్ణ మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కీర్తి సురేష్ అందం, అభిన‌యంతో పాటు న‌వీన్ కృష్ణ ప‌ర్పార్మెన్స్ ఆక‌ట్టుకుంటాయి.  ఇక కృష్ణ వంశీ గారి లాంటి పెద్ద ద‌ర్శ‌కుల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన రాంప్ర‌సాద్ రగుతు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించాడు.  ఇందులో స‌ప్త‌గిరి, పోసాని, రాహుల్ దేవ్ , ర‌ఘు కారుమంచి ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల్లో న‌టించారు. మ‌రో ఇంపార్టెంట్ రోల్ లో చాందిని న‌టించింది.   త్వ‌ర‌లో సినిమా విడ‌దుల తేదీ ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.


 కీర్తి సురేష్‌, న‌వీన్ కృష్ణ‌, చాందిని, పోసానికృష్ణ ముర‌ళి, నాగ‌బాబు, రాహుల్ దేవ్, స‌ప్త‌గిరి, రాఘ‌వ‌, ర‌ఘు తదిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః అచ్చు రాజ‌మ‌ణి, డిఓపీః సురేష్ ర‌గుతు;  పీఆర్వోః ర‌మేష్ చందు;  డైలాగ్స్ః సురేష్ వ‌ర్ధినేది;  కో-ప్రొడ్యూస‌ర్ః టి.ర‌మేష్‌; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ప‌వ‌న్ రెడ్డి కోటిరెడ్డి;  నిర్మాతః త‌మటం కుమార్ రెడ్డి;   డైర‌క్ట‌ర్ః రామ్ ప్ర‌సాద్ ర‌గుతు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

14 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

14 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

14 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago