స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు కే విజయ్ భాస్కర్ కొంత విరామం తర్వాత మెగాఫోన్ పడుతున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
విజయ భాస్కర్ దర్శకత్వంలోవస్తున్న 13వ చిత్రమిది. ఈ చిత్రానికి సంబధించిన నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్‌లోని మణికొండలో ఘనంగా జరిగింది. విజయ భాస్కర్, జీవిత రాజశేఖర్, కార్తికేయ నిర్మాత బొగ్గరం వెంకట శ్రీనివాస్, పారిశ్రామికవేత్త, నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ ఈ వేడుకకు హాజరై నిర్మాతకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ..రాబోవు విజయదశమి రోజున ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమౌతుందని, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఆ రోజు వెల్లడిస్తామని తెలిపారు.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఈ చిత్రం కోసం యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే కథని సిద్ధం చేశారు దర్శకులు విజయభాస్కర్.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…