కింగ్ నాగార్జున’ది ఘోస్ట్’  ఫస్ట్ సింగిల్ వేగం సెప్టెంబర్ 16న విడుదల

Must Read

కింగ్ అక్కినేని నాగార్జున,  క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ల భారీ యాక్షన్ థ్రిల్లర్’ ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్‌ కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర అంశాలు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.

ఇప్పుడు ది ఘోస్ట్  ఆడియో ప్రమోషన్‌ లకు సమయం ఆసన్నమైంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వేగం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఇది ఒక రొమాంటిక్ సాంగ్

భరత్, సౌరబ్ ద్వయం ఈ పాటను స్కోర్ చేశారు. కపిల్ కపిలన్,  రమ్య బెహరా పాడిన ఈ పాటకు కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు.

సాంగ్ రిలీజ్ పోస్టర్ లో నాగార్జున, సోనాల్ చౌహాన్ క్రూయిజ్‌లో కలిసి సమయాన్ని ఆస్వాదించడాన్ని చూడవచ్చు. నాగార్జున,  సోనాల్ ని ప్రేమగా దగ్గరగా తీసుకొని చెంపపై ప్రేమగా ముద్దు పెడుతుండగా, ఆమె అతని కౌగిలింత ముద్దులోని వెచ్చదనాన్ని అనుభవిస్తున్నట్లు పోస్టర్ లవ్లీగా వుంది. సోనాల్ గ్లామరస్ అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది. 

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

 ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా,  బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు

సాంకేతిక విభాగం

దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్

బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్

సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.

సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ – సౌరబ్)

యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్

ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల

పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు

Latest News

Deccan Sarkar Movie Poster and Teaser Launch

Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had its poster and teaser...

More News