ప్రెస్ మీట్లు

విశ్వం చిత్రంలో ప్రతీదీ చాలెంజ్ గా అనిపించింది – కావ్యథాపర్

గోపీచంద్, కావ్యథాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు  శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వేణు దోనేపూడి, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 11న థియేటర్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా  కావ్యథాపర్ విలేకకరుల సమావేశంలో విశ్వం గురించి పలు విషయాలు తెలియజేశారు.

విశ్వం చిత్రం మీకు ఎంత వైవిధ్యంగా వుండబోతోంది?
విశ్వంలో నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. విశ్వంలో అన్నీ వైవిధ్యంగా వుంటాయి. మల్టీపుల్ లొకేషన్స్, నటీనటులు. దాదాపు 16 మంది కమేడియన్స్ ఇందులో వున్నారు. టీజర్ లో చూసినట్లు వెన్నెల కిశోర్, విటి గణేష్ వంటివారు ఇందులో నటించారు. టెక్నికల్ గా చైతన్య భరద్వాజ సంగీతం బాగుంది. పాటలు ఇప్పటికే బిగ్ హిట్ అయ్యాయి.  

పాత్ర పరంగా మీకు ఛాలెంజింగ్ అనిపించిన అంశాలేవి?
నా కేరెక్టరే భిన్నంగా డిజైన్ చేశారు. దర్శకడు శ్రీనువైట్ల గారు సన్నివేశపరంగా సీన్స్ చెప్పి నాచేత చేయించడం అనేది పెద్ద చాలెంజింగ్ అనిపించింది. ఆయన అన్ని విషయాల్లో ఫర్ ఫెక్ట్ గా వుంటారు. సిట్యువేషన్ పరంగా సన్నివేశాన్ని వివరించే విధానంలో కొత్తదనం చూపారు. నాది చాలా స్టయిలిష్ కేరెక్టర్. నేను కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ఇందులో చేశాను. మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని. కనుకనే కాస్ట్యూమ్స్ పరంగా చాలా కేర్ తీసుకోవాల్సి వచ్చింది. నాకున్న ఐడియాతోనూ, కాస్ట్యూమ్స్ డిజైనర్ ఐడియాకి తోడు శ్రీనువైట్ల గారి ఐడియాతో కాస్ట్యూమ్స్ ధరించాను.

పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో చేయడం ఎలా అనిపించింది?
ముందుగా చిత్రాలయ బేనర్ సినిమా చేసింది. ఆ తర్వాత పీపుల్స్ మీడియా కలవడంతో రేంజ్ పెరిగింది. నిర్మాణవిలువలు చాలా హైలో వున్నాయి. వారు చాలా కేర్ తీసుకున్నారు. హిమాచల్, మనాలి వంటి చోట్ల మంచు ప్రాంతాల్లో వర్క్ చేయడం చాలా కష్టం. అంత కష్టమైన ప్రాంతాల్లో చాలా  ప్రికాషన్స్ తీసుకునేలా వారు సహకరించారు. చాలా మంది టీమ్ ను అక్కడి వచ్చేలా చేసి సినిమా బాగా వచ్చేలా చేశారు. రిచ్ నెస్ రేపు సినిమాలో కనిపిస్తుంది.

గోపీచంద్ తో నటిచడం ఎలా అనిపించింది ?
నేను చాలా ఫాస్ట్ గా జోవియల్ గా వుంటాను. గోపీచంద్ గారు చాలా కామ్ గా వుంటారు. సెట్లో చాలా సైలెంట్. తన పనేదో తాను చేసుకుంటారు. అందుకు భిన్నమైన కారెక్టర్ నాది. అందుకే ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. మాడ్యులేషన్ పరంగా నైతే, సిస్టమాటిక్ విషయాలన్నీ గ్రహించాను. ఒకరకంగా తెలుగుకూడా నేర్చుకున్నా.

దర్శకుడి గురించి చెప్పాలంటే ఏమి చెబుతారు?
శ్రీనువైట్ల గారి డెడికేషన్ కు హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమాలో చాలా పాత్రలున్నాయి. అందరినీ మోటివేట్ చేయడమంటే మాటలు కాదు. ప్రతివారి నుంచి ఔట్ పుట్ రాబట్టుకోవాలి. ఒకరకంగా చెప్పాలంటే శ్రీనుగారి వల్లే నేను బాగా నటించగలిగాను. అంతా నాచురల్ గా వచ్చేలా చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ చాలా నేచురల్ గా వుంటుంది. అంతమంది కమేడియన్స్ ట్రెయిన్ లో వున్నా వారంతా సన్నివేశరంగా వుంటారు. గతంలో ఆయన చేసిన సినిమాతో ట్రెయిన్ ఎపిసోడ్ పోల్చలేం. గతంకంటే విశ్వం చాలా కొత్తగా వుంటుందని చెప్పగలను. ప్రత్యేకత ఏమంటే అందరి పాత్రలను దర్శకుడు ఎలా యాక్ట్ చేయాలో చేసి చూపించేవారు. అలా నాకు కూడా నా పాత్రపరంగా చెబుతూ నా శైలిని మలుచుకునే చేశారు.

మీనుంచి కామెడీ ఆశించవచ్చా?
తప్పకుండా. నా పాత్ర కూడా కామెడీ చేస్తుంది. నా ఫ్యామిలీ మెంబర్లు నరేష్ గారు, ప్రగతి గారు. డిఫరెంట్ గా మా ఫ్యామిలీ సినిమాలో కనిపిస్తుంది. నా పాత్రను బాగా ఎంజాయ్ చేస్తారు.

చాలా మంది నటులున్నారు గదా? మీకేమనిపించింది?
ఎంతమంది  వున్నా ఎవరి పాత్ర వారిదే. ఎవరిశైలి వారిదే,. అందరినీ మెప్పించేలా దర్శకుడు స్క్రిప్ట్ రాసుకున్నారు. ఆయా పాత్రలకు అనుగుణంగా వారు నటించేలా చేయడం గొప్ప విషయం.

పాటల గురించి మీకేమనిపించింది?
విశ్వంలో రెండు పాటలున్నాయి. రెండూ నాకు బాగా నచ్చాయి. ఒకటి శేఖర్ మాస్టర్, మరోటి శిరీష్ మాస్టర్ కంపోజ్ చేశారు. డాన్స్ వేయడంలో చాలా మెళకువలు నేర్చుకున్నా. చైతన్య భరద్వాజ బాణీలు పాటలకు ఎసెట్ గా వుంటాయి.

ఎటువంటి పాత్రలు చేయాలనుంది?
ఇందులో గ్లామర్ పాత్ర చేశాను. నటిగా అన్ని పాత్రలు చేయాలనుంది. ఎటువంటి టఫ్ పాత్రనైనా చేస్తానే ధైర్యం కూడా వచ్చేసింది. సైకో కిల్లర్ తరహా పాత్రలు చేయడం టప్. కానీ అవి కూడా చేస్తాను. నటిగా పాత్రకు న్యాయం చేయాలి అనే నమ్ముతాను.

సక్సెస్, ఫెయిల్యూర్ ను ఏవిధంగా చూస్తారు?ః
అది నా చేతుల్లో లేదు. నావరకు నేను పాత్రకు న్యాయం చేస్తాను. ఇచ్చిన పాత్రకు కష్టపడి పనిచేయడమే తెలుసు. మిగిలింది దేవుడిపై భారం వేస్తా. నేను చేసిన పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి ప్రతివారికీ వస్తుంటాయి.  

ఈ సినిమాలో మీకు ఫిజికల్ చాలెంజ్ అనిపించిన సందర్భాలున్నాయా?
వున్నాయి. ఔట్ డోర్ షూట్ లో చాలా చాలెంజింగ్ అనిపించింది. టెంపరేచర్ ఎక్కువగా వున్నప్పుడు, హిమాచల్ వంటి చోట్ల మైనస్ డిగ్రీలలో వాతావరణ వున్నప్పుడు యాక్ట్ చేయడం అనేది ఫిజికల్ చాలెంజ్. అవన్నీ చూసుకుని దేనికైనా రెడీ అన్నట్లుగా చేయగలిగాను. నాతోపాటు సాంకేతిక సిబ్బంది కెమెరాలు మోసుకుని రావడం, ఇతర సిబ్బంది కొండలు ఎక్కడం వంటివన్నీ చాలా చాలెంజింగ్ అంశాలే.

విశ్వంలో యూనిక్ పాయింట్ ఏమిటి?
కథే యూనిక్ పాయింట్. దర్శకుడు శ్రీను వైట్ల గారు తీసిన విధానం యూనిక్. కెవిమోహన్ కెమెరా పనితం యూనిక్. ఇందులో నేను గ్రే తరహా పాత్ర చేశాను. అది కూడా యూనికే. ఒకరకంగా చెప్పాలంటే విశ్వంలోనే అన్ని వున్నాయి.

విశ్వం ద్వారా మీరేమి నేర్చుకున్నారు?
నేను మొదటే చెప్పినట్లుగా దర్శకుడి నుంచే చాలా నేర్చుకున్నా. సీన్ పరంగా డైలాగ్స్ పలకడంలోనూ ఒకటికి రెండు సార్లు రాకపోయినా ఓపిగ్గా ఆయన మా నుంచి రాబట్టుకున్న విధానం నుంచి చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా టైమింగ్ లో రైట్ పాజెస్ అనేవి ఎలా తీసుకోవాలో గ్రహించాను. తోటి నటీనటులు టైమింగ్ కు అనుగుణంగా హావభావాలు డైలాగ్స్ చెప్పడం  ఛాలెంజింగ్ గా అనిపించింది. విశ్వం ఔట్ డోర్ షూట్ లో ప్రతీదీ కొత్తగా నేర్చుకున్నదే. నాకు గొప్ప అనుభూతి కలిగించిన సినిమా ఇది.

కొత్తగా చేయబోయే సినిమాల గురించి?
కొత్త సినిమాలు లైన్ లో వున్నాయి. ఇప్పటికే మూడు సినిమాలకు సైన్ చేశాను. త్వరలో మీకు మరిన్ని విషయాలు తెలియజేస్తాను.

Tfja Team

Recent Posts

ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గర నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నారు సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్. ఇటీవల…

37 minutes ago

Supreme Hero Sai Durgha Tej Receives a Special Gift from AP Deputy CM Pawan Kalyan

Supreme Hero Sai Durgha Tej recently received a special gift from Andhra Pradesh Deputy CM…

39 minutes ago

రోటీ కప్డా రొమాన్స్” నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్.

నవంబరు 28న రోటి కపడా రొమాన్స్‌ గ్రాండ్‌ విడుదల.. ఈ నెల 22 నుంచి గ్రాండ్‌ ప్రీమియర్స్‌హుషారు, సినిమా చూపిస్త…

44 minutes ago

“Roti Kapda Romance” Grand Release on November 28; Paid Premieres from November 22

Prominent producer and head of Lucky Media, Bekkem Venugopal, known for youth-centric films like Hushaaru,…

47 minutes ago

Tirupati Jawan: The Lyricist Behind the Latest Trendy Hits

In today's film industry, for a movie to click, it's songs need to capture everyone's…

3 hours ago

మారిన ‘ఉద్వేగం’ విడుదల తేదీ

నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న కోర్టు డ్రామా 'ఉద్వేగం' కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్…

4 hours ago