దర్శకుడు తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ ‘అహింస’ షూటింగ్ పూర్తి

స్టార్స్‌తో పాటు నూతన నటీనటులతో బ్లాక్‌బస్టర్‌లను అందించగల సామర్థ్యం దర్శకుడు తేజ సొంతం. ఆయన తన చిత్రాలతో చాలా మంది నటులను పరిచయం చేశారు. వారిలో కొందరు స్టార్‌లుగా మారారు. కంటెంట్‌యే కింగ్ అని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తాయని చాలాసార్లు నిరూపించారు తేజ.

ఇప్పుడు తేజ ‘అహింస’ అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో మరో కొత్త నటుడు అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన కథతో తేజ మార్క్ సినిమా ఇది.

ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతిక తివారీ కథానాయికగా కనిపిస్తున్న ఈ చిత్రంలో సదా, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సినిమా ప్రీ లుక్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. ‘అహింస లో హై యాక్షన్‌ ఉంటుందనే అభిప్రాయాన్ని ఇచ్చింది. సినిమా షూటింగ్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనుంది.

అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన ఆర్‌పి పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నువ్వు నేను తర్వాత తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్,  ఆర్‌పి పట్నాయక్ మరో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ అందించడానికి మరోసారి  చేతులు కలిపారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సమీర్ రెడ్డి, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు పని చేస్తున్నారు, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందించగా, సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.

త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు నిర్మాతలు.

తారాగణం: అభిరామ్, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు

సాంకేతిక విభాగం

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
నిర్మాత: పి కిరణ్
బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
డీవోపీ : సమీర్ రెడ్డి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల
సాహిత్యం: చంద్రబోస్
ఆర్ట్: సుప్రియ
యాక్షన్ డైరెక్టర్: బివి రమణ
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: శంకర్
సిజి: నిఖిల్ కోడూరి
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

4 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

4 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

4 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

4 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

4 days ago