‘ఆకాశ వాణి విశాఖపట్టణ కేంద్రం’ సెకెండ్ లిరికల్ సాంగ్ విడుదల

Must Read

శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా మిథున ఎంట‌ర్‌టైన్‌మెట్స్ ప్రై.లి, సైన్స్‌ స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న చిత్రం ‘ఆకాశ‌వాణి విశాఖప‌ట్టణ కేంద్రం’. జ‌బ‌ర్దస్త్ ఫేం స‌తీష్ బ‌త్తుల ఈ చిత్రంతో దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఎం.ఎం. అర్జున్‌ నిర్మాత‌. థ్రిల్లింగ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ , హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల చేస్తున్నారు. కార్తీక్ కొడ‌కండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి సెకెండ్ సాంగ్ ను శనివారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

Maa kalala Telugu Lyrical Song | Visakhapattana Kendram Movie | Penchal Das

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎం.ఎం.అర్జున్ మాట్లాడుతూ ‘‘సతీష్‌ క‌థ చెప్పగానే బాగా న‌చ్చింది. ఆయ‌న సినిమాను నెరేట్ చేసిన దాని కంటే చ‌క్కగా తెర‌కెక్కించారు. ఓ మంచి సినిమాను రూపొందించ‌డంలో నిర్మాత‌గా నా వంతు బాధ్యత‌ను స‌మ‌ర్ధవంతంగా నిర్వర్తించాను. హీరో హీరోయిన్లు శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన చ‌క్కగా న‌టించారు. యూనివర్సల్ పాయింట్ కావటంతో సినిమాను పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. కార్తీక్ కొడ‌కండ్ల సంగీతం అందించారు. గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన తొలి లిరికల్ సాంగ్ కి మంచి స్పందన వచ్చింది. దాంతో శనివారం సెకెండ్ లిరికల్ సాంగ్ ను విడుద‌ల చేశాం. ఈ సాంగ్ ని ప్రముఖ గాయకుడు, రచయిత పెంచలదాస్ రాసి… ఆలపించారు. గతంలో ఆయన పాడిన అరవింద సమేత, కృష్ణార్జున యుద్ధం చిత్రాల సాంగ్ కి ఎంత మంచి పేరు వచ్చిందో… ఈ సాంగ్ కి అంతే స్థాయిలో పేరు రావడం ఖాయం. త్వ‌ర‌లోనే ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు.

ఇక దర్శకుడు సతీష్ బత్తుల మాట్లాడుతూ ‘‘‘ఆకాశ‌వాణి విశాఖ‌ప‌ట్టణ కేంద్రం’ చిత్రం డిఫ‌రెంట్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. నిర్మాత మ‌ల్లికార్జున్‌గారి స‌పోర్ట్ లేక‌పోతే ఇంత దూరం రాగ‌లిగే వాళ్లం కాదు. మేకింగ్‌లో మ‌ల్లికార్జున్‌ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. పాన్ ఇండియా మూవీగా సినిమా రిలీజ్‌కి సన్నద్ధమవుతుంది. శివ‌, ఉమ‌య‌, దేవీప్రసాద్‌, మాధ‌వీల‌త ఇలా మంది ఆర్టిస్టులు ఇందులో నటించారు. కార్తీక్ మ్యూజిక్‌ అందించగా, ఆరీఫ్ సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు. ఇలా ఈ సినిమాకి చాలా అనుభవం వున్న సాంకేతిక నిపుణులు పని చేశారు. దాంతో సినిమా చాలా బాగా వ‌చ్చింది. పెంచలదాస్ రాసి, పాడిన పాటకి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.

న‌టీన‌టులు:

శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్‌: మిథున ఎంట‌ర్‌టైన్‌మెట్స్ ప్రై.లి, సైన్స్‌ స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్స్‌
కో ప్రొడ్యూస‌ర్స్‌: విశ్వ‌నాథ్‌.ఎం, హ‌రి కుమార్.జి, క‌మ‌ల్ మేడ‌గోని
సంగీతం : కార్తీక్‌ కొడ‌గండ్ల‌
నిర్మాత : ఎం.ఎం.అర్జున్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : స‌తీష్ బ‌త్తుల‌
PRO: వంగాల కుమారస్వామి (Boxoffice)

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News