“నేచర్” మూవీ లోని “నిన్నే చూడందే.లిరికల్ సాంగ్ ను లాంచ్ చేసిన కమెడీయాన్ ఆలీ 

Must Read

ప్రకృతి ని ఇష్టపడే కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. ఆ ప్రేమ వల్ల తను ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరకు ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేదే “నేచర్” చిత్ర కథాంశం. శ్రీ సప్తమ్ క్రియేటివ్ ప్రొడక్షన్స్  పతాకంపై  కృష్ణ , ముస్కాన్ రాజేందర్ జంటగా అశ్విన్ కామరాజు కొప్పల దర్శకత్వంలో సి.యశోదమ్మ,,టి. చేతన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం  “నేచర్”. తలకోన, తిరుపతి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. వినాయక చవితి  సందర్బంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఈ చిత్రం లోని  “నిన్నే చూడందే” లిరికల్ సాంగ్ ను ముఖ్య అతిధిగా వచ్చిన కమెడియన్ అలీ ఘనంగా విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమం లో నటుడు కృష్ణుడు, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్, కమెడియన్ గౌతమ్ రాజు లతో పాటు చిత్ర యూనిట్  పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో 

ముఖ్య అతిధిగా వచ్చిన కమెడీయన్ అలీ మాట్లాడుతూ.. గౌతమ్ రాజు నేను ఎవరి సపోర్ట్ లేకుండా తన స్టైల్ లో తను , నా  స్టైల్ లో నేను ఎదిగి ఇండస్ట్రీ లో సెట్లయ్యాము.. అలాగే నేచర్ సినిమా టైటిల్ బాగుంది. నేచర్ బాగుంటే మనందరం బాగుంటాము. నాకు ఇళయరాజా పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట చూస్తుంటే నాకు ఇళయరాజా పాటలు గుర్తుకువస్తున్నాయి. యం. యల్ రాజా అద్భుతమైన మ్యూజిక్ చేశాడు లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో హీరోయిన్స్ కూడా సాంగ్ లో చాలా బాగా నటించారు. కెమెరామెన్ వర్క్ కూడా చాలా బాగుంది..నేచర్  టైటిల్ పెట్టి ఆ నేచర్ లో సినిమా చెయ్యడం అంటే ఆషామాసి కాదు. ఆ నేచర్ లో కూడా మంచి చెడు రెండు ఉంటాయి.ఆ మధ్య మనం చూశాము. నేచర్ కొరకు వెళ్లిన కొందరు స్టూడెంట్స్ ఉన్న డ్యామ్ లొకి ఆకస్మాత్తు గా నీరు వచ్చి చాలా మంది చనిపోయారు. అందుకే పెద్దలు నీరు, నిప్పు, గాలి కి దూరంగా ఉండాలని చెపుతారు. అలాంటిది వీరు ఈ సినిమాను ఇక్కడే షూటింగ్ చేసుకోకుండా తలకోన వెళ్లి షూటింగ్ చేయడం చాలా గ్రేట్. అలాంటి ప్లేస్ లో ఎంతో హార్డ్ వర్క్ చేసిన టెక్నిషియన్స్ కు థాంక్స్ చెప్పాలి. హీరో కృష్ణ లాంటి ట్యాలెంట్ ఉన్న నటుడుకు సపోర్ట్ ఇస్తే నటుడుగా పైకి వస్తాడు అన్ని నమ్మి  ప్రకృతి సంబందించిన మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని చేస్తున్న నిర్మాతలకు, దర్శకునికి ఈ సినిమా “రామ్ తేరా గంగా మైలీ ” అంతటి బిగ్ హిట్టు అవ్వాలి అన్నారు.

దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు నచ్చే విధంగా ఇద్దరు టీచర్స్ రాసిన కథే ఈ “నేచర్.”నిన్నే చూడందే”.లిరికల్ సాంగ్ చూస్తుంటే ఇందులో  మ్యూజిక్, ట్యూన్,బ్యాక్ డ్రాప్ గానీ  చాలా బాగుంది. గౌతమ్ రాజు తనయుడు కృష్ణ కు ఇది ఆరవ సినిమా.తను మంచి ట్యాలెంట్ ఉన్న నటుడు. తను  ఇంకా ఎన్నో సినిమాలలో  నటించాలని కోరుకుంటున్నాను. యం. యల్ రాజా మ్యూజిక్ చాలా బాగుంది.నేచర్ వంటి మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న ఈ చిత్రం దర్శక, నిర్మాతలకు మంచి పేరుతో పాటు  సినిమా పెద్ద విజయం సాదించాలి  అన్నారు.

కథా రచయితలు సుధాకర్ తుపాకుల, రవి చల్ల మాట్లాడుతూ.. మా చిత్ర లిరికల్ విడియోను విడుదల చేసిన అలీ గారికి ధన్యవాదాలు.. కరోనా వచ్చి ప్రపంచాన్ని కుదిపేస్తున్న టైమ్ లో మాకు ఈ ఆలోచన వచ్చింది. ఎందుకు అందరూ ఇలా ఇబ్బంది పడుతున్నారు. నేచర్ బాగుంటే ఇంత కష్టాలు రావు కదా..వ్యక్తి యొక్క నేచర్ లో మార్పు  పెర్ఫెక్టుగా ఉంటే ఇలాంటి విపత్తులు రావు, నేచర్ ను మనం కాపాడుకోవాలి, మన ఫ్యామిలీని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో సమాజంలో బ్రతికే ప్రతి ఒక్కరూ కూడా  ప్రకృతిని పై అలాంటి రెస్పాన్స్ బిలిటీని తీసుకుంటే ముందు తరాలకు మేలు చేసిన వారిమవుతామని తెలియజేప్పే కథే ఈ “నేచర్”. భగవంతుడు ఇచ్చినటువంటి మంచి ప్రకృతిని మన అవసరాల కోసం విఘాతం కల్గిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని ప్రకృతిని కాపాడుకోవాలని కోరుతూ సోషల్ అవేర్నెస్ మనమంతా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నాము.ఈ సినిమాకు పని చేసిన నటీ, నటులు టెక్నిసియన్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా  ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు అశ్విన్ కామరాజు  కొప్పల మాట్లాడుతూ.. అలీ గారు ఎంతో బిజీ గా ఉన్నా మా ఈవెంట్ కు వచ్చి లిరికల్ వీడియోను విడుదల చేసిన అలీ గారికి ధన్యవాదములు.ఇప్పడు మీరు చూసిన ప్రతి సీన్ ప్రతి షార్ట్ సినిమాలో ఇలానే ఉంటుంది. ప్రకృతి ని ఇష్టపడే కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. ఆ ప్రేమ వల్ల తను ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరకు ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేదే “నేచర్” చిత్ర కథాంశం. నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటుడు గౌతమ్ రాజు  మాట్లాడుతూ..అలీ నేను అన్నదమ్ముల్లా ఉంటాము. తనకు చెప్పిన వెంటనే సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చారు.తనను  నా ధన్యవాదాలు. తిరుపతిలో ఉండే సుధాకర్, రవి లు టీచర్స్. వీరిద్దరూ కలసి చక్కటి కథను తయారుచేసుకొన్నారు. వీరిద్దరినీ చూస్తుంటే నాకు పరుచూరి బ్రదర్స్ గుర్తుకువచ్చారు వీరు కూడా మొదట టీచర్స్.చిత్ర దర్శకుడు అశ్విన్ కామరాజు  కొప్పల ఈ కథను చాలా చక్కగా తెరకెక్కిస్తున్నాడు. హీరో, హీరోయిన్ లిద్దరూ చాలా బాగా నటించారు యం. యల్. రాజా మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది.. ఇలాంటి మంచి కథను సెలెక్ట్ చేసుకొని  నిర్మిస్తున్న సి.యశోదమ్మ, టి. చేతన్ లకు ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.

సంగీత  దర్శకుడు యం. యల్. రాజా  మాట్లాడుతూ.. నేచర్ సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్న వారు సినిమా రంగంలోకి  రావడం చాలా సంతోషంగా ఉంది.దర్శక, నిర్మాతలు నాకు మంచి ఫ్రీడమ్ ఇవ్వడంతో ఇందులోని పాటలు చాలా బాగా వచ్చాయి. సింగర్స్  అందరూ బాగా సహకరించారు. హీరో హీరోయిన్స్  చాలా చక్కగా నటించారు. ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన  దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు అన్నారు.

చిత్ర హీరో  కృష్ణ, హీరోయిన్  ముస్కాన్ రాజేందర్ లు మాట్లాడుతూ.. నేచర్ లాంటి మంచి  చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు అన్నారు 

నటుడు కృష్ణుడు మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు  యం. యల్. రాజా చేసిన ఈ సాంగ్ చూస్తుంటే మెలోడీ సాంగ్ లా చాలా బాగుంది.హీరో హీరోయిన్ కూడా ఈ పాటలో  బాగున్నారు. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తెరకేక్కిస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

నటీ నటులు 

కృష్ణ , ముస్కాన్ రాజేందర్,గణేష్ వెంకట్రామన్, అజయ్ ఘోష్,గౌతం రాజు తదితరులు 

సాంకేతిక నిపుణులు 

బ్యానర్ : శ్రీ సప్తమ్ క్రియేటివ్ ప్రొడక్షన్స్ 

నిర్మాతలు : సి.యశోదమ్మ,,టి. చేతన్ 

స్టోరీ : సుధాకర తుపాకుల, రవి చల్ల 

స్క్రీన్ ప్లే డైరెక్షన్ : అశ్విన్ కామరాజు  కొప్పల 

డి. ఓ. పి. : విజయ్ ఠాగూర్ 

మ్యూజిక్ : యం. యల్. రాజా 

ఎడిటర్ : మహేంద్ర 

పి. ఆర్. ఓ :  సజ్జ వాసు

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News