ఈవారం.. మరెన్నడూ లేనంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించనున్న ఆహా

*అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2లో గెస్టులుగా అడివి శేష్, శర్వానంద్

* డాన్స్ ఐకాన్‌లో ముఖ్య అతిథిగా మెరవనున్న రాశీ ఖన్నా

* చెప్ మంత్ర సీజన్ 2లో అలరించనున్న రష్మీ గౌతమ్, గెటప్ శీను

తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్న అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓటీటీ మాధ్యమం ఆహా. ప్రతి వారం ఆడియెన్స్‌ని సూపర్బ్ ఎంటర్‌టైనింగ్ షోస్‌తో ఆహా అలరిస్తోంది. అదే ఎనర్జీని కంటిన్యూ చేస్తూ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2లో  హీరోలు అడివి శేష్, శర్వానంద్ గెస్టులుగా అలరించబోతున్నారు. మరో వైపు డాన్స్ ఐకాన్ షోలో రాశీ ఖన్నా, చెఫ్ మంత్ర సీజన్ 2లో గెటప్ శీను, రష్మీ గౌతమ్ అతిథులుగా అలరిచంబోతున్నారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకుల కోసం ఫుడ్, డాన్స్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను సరికొత్తగా అందించడానికి సిద్ధమైంది ఆహా.

డాన్స్ ఐకాన్ (నవంబర్ 5, నవంబర్ 6)

ప్రజల్లో గొప్ప డాన్సింగ్ టాలెంట్‌ను బయటపెట్టే డాన్స్ షో డాన్స్ ఐకాన్. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డాన్స్ షో. ఈ షోలో పాల్గొనే ప్రతి కంటెస్టెంట్‌లోని బెస్ట్ టాలెంట్‌ను ప్రతివారం ఈ షో బయటకు తీసుకొస్తుంది. ప్రతి శని, ఆది వారాల్లో ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓంకార్ హోస్ట్ చేస్తోన్న ఈ షోకి రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలోని టాప్ కంటెస్టెంట్స్ మధ్య జరగబోయే పోటీని చూడటం అస్సలు మరచిపోకండి.ఇది కేవలం ఆహాలోనే.

చెఫ్ మంత్ర సీజన్ 2

నటి, నిర్మాత, రచయిత, దర్శకురాలు, సామాజిక వేత్త, ఎన్‌ఎఫ్‌టి కలెక్టర్ లక్ష్మీ మంచు మంచు భోజన ప్రియురాలు. అలాంటి ఆమె చెఫ్ మంత్ర సీజన్ 2కి హోస్ట్‌గా మారారు. కార్యక్రమంలో పాల్గొనే అతిథుల జీవన విధానం, జీవన శైలిని అనుసరించి సరికొత్త ఫుడ్ ఐటెమ్స్‌ను తయారు చేస్తారు. ఈ వారం రష్మీ గౌతమ్, గెటప్ శీను షోలో అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈ షో సమయంలో వారు వారికి నచ్చిన ఆహారం, దానితోనే ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago