‘రానా నాయుడు సీజ‌న్‌2’ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌

Must Read

మోర్ ఫ్యామిలీ డ్రామా.. మోర్ ధ‌మాకా.. ‘రానా నాయుడు సీజ‌న్‌2’ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌

ఫిక్స‌ర్ మ‌ళ్లీ తిరిగొచ్చాడు.. అయితే ఈసారి త‌న కుటుంబం కోసం. 2023లో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన సిరీస్ ‘రానా నాయుడు’ ఎంత పెద్ద ఆద‌ర‌ణ‌ను పొందిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొన‌సాగింపుగా ‘రానా నాయుడు సీజ‌న్‌2’ మ‌న ముందుకు రానుంది. గ‌త‌సారి కంటే క‌ఠిన‌మైన, చీక‌టి పొర‌ల‌ను క‌లిగిన అంశాలు ఇందులో ఉండ‌బోతున్నాయి. ఈసారి ఫిక్సర్ కుటుంబం ఇబ్బందుల్లో ప‌డుతుంది. సాధార‌ణంగా త‌న క్లైంట్స్ కోసం స‌మ‌స్య‌ల‌ను సాల్వ్ చేసి రానా నాయుడు ఈసారి త‌న కుటుంబం కోసం రంగంలోకి దిగుతాడు. కుటుంబం ప్ర‌మాదంలో ఉన్న‌ప్పుడు నియ‌మ నిబంధ‌న‌ల‌కు సంబంధిచిన హ‌ద్దుల‌ను అత‌ను దాటుతాడు.

సీజ‌న్‌1లో ప్రేక్ష‌కులు రానా నాయుడు అనే అద్భుత‌మైన ప్ర‌పంచంలోకి తీసుకెళ్ల‌బ‌డ్డారు. ధ‌న‌వంతులు, దురాశ‌ప‌రులు చేసిన త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చే నైపుణ్య‌మున్న రానా నాయుడు, నేరాల‌ను చెరిపేయ‌గ‌ల‌డు, జీవితాల‌ను తిర‌గ రాయ‌గ‌ల‌డు, భ‌యంకర‌మైన ర‌హ‌స్యాల‌ను ఎవ‌రికీ క‌నిపించ‌కుండా దాచేయ‌గ‌ల‌డు. ప్ర‌పంచంలో ఎలాంటి ప‌నినైనా చేయ‌గ‌ల రానా, త‌న తండ్రిని మాత్రం ఎదుర్కొన‌లేడు. రానా నాయుడు తండ్రి నాగ నాయుడు కొడుక్కి దూరంగా ఉంటాడు. ఓ సంద‌ర్భంలో కొడుకు జీవితంలోకి నాగ‌నాయుడు ప్ర‌వేశించాల్సి వ‌స్తుంది. ఎవ‌రికీ తెలియ‌ని ఓ గ‌తాన్ని మోసే టైం బాంబ్‌లాంటి వ్య‌క్తి నాగ నాయుడు. నాయుడు కుటుంబం ఏప‌నిని అసంపూర్తిగా చేయ‌రు. ప్రమాద‌క‌ర‌మైన వ్య‌క్తులు, గాయాల‌ను భ‌రిస్తున్నవారు. గ‌తంలో జ‌రిగిన త‌ప్పుల‌ను ఎదుర్కొన‌టానికి సిద్ధంగా ఉంటారు.

సీజ‌న్1 కంటే సీజ‌న్‌2లో మ‌రింత తీవ్ర‌త‌ర‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తాయి. ఈసారి వారు ఎదుర్కొన‌బోయే ప్ర‌మాదం వారి వ్య‌క్తిగ‌త‌మైన‌ది. పాత గాయాల‌కు ప‌గ తీర్చుకోవాల‌ని గ‌తం కోరుకుంటుంది. ర‌వుఫ్‌- రానాకు స‌మాన‌మైన శ‌త్రువు. త‌న ప‌గ‌ను తీర్చుకోవ‌టానికి ఎలాంటి ప‌నినైనా చేయ‌టానికి వెనుకాడు. రానా చిట్ట‌చివ‌ర‌గా ఓ ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌నిని ఫిక్స్ చేయాల‌ని భావిస్తాడు. ఆ ప్ర‌య‌త్నంలో అత‌ను చివ‌రి వ‌ర‌కు చేరుకుంటాడు. అది విజ‌య‌వంత‌మైతే అత‌ని కుటుంబ భ‌విష్య‌త్తు బాగుంటుంది. అయితే రౌఫ్ రూపంలో అనుకోని తుపాన్ ఎదుర‌వుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య యుద్దం మొద‌ల‌వుతుంది. స‌మ‌యం పూర్తైపోతుంటుంది. దారులు మూసుకుపోతుంటాయి. ఇలాంటి ప‌రిస్థితుల్ల‌ను రానా అదుపులోకి తెచ్చుకోగ‌ల‌డా? లేక ఇబ్బంది ప‌డ‌తాడా?

సూర్వీన్ చావ్లా, కృతి ఖర్భందా, సుషాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, మరియు డినో మోరియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సీజ‌న్‌2లో ఆక‌ట్టుకునే యాక్ష‌న్‌, హై ఓల్టేజీ ఫ్యామిలీ డ్రామా ఉండ‌నుంది. కుట్ర‌, విమోచ‌నం ఇంకా వాటి మ‌ధ్య ఉండే బావోద్వేగాల‌ను ఈ సీజ‌న్‌లో మ‌నం చూడొచ్చు.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా, సిరీస్ హెడ్‌, తాన్యా బామి మాట్లాడుతూ ‘‘రానా నాయుడు సీజన్1 వచ్చిన రెండేళ్లలోనే మరోసారి యాక్ష‌న్ డ్రామా ఫ్రాంచైజీతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌టం చాల ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. సెల‌బ్రిటీల స‌మ‌స్య‌ల‌ను గుర్తించి, వాటిని ప‌రిష్క‌రించే వ్య‌క్తిగా సీజ‌న్లో రానా మ‌న‌కు క‌నిపించారు. అయితేజ సీజ‌న్‌2లో మాత్రం త‌న కోసం, త‌న కుటుంబం కోసం పోరాడాల్సి వ‌స్తుంది. శత్రువులతో చేసే యుద్ధంలో త‌నకు ద‌గ్గ‌రైన వాళ్ల‌ను ర‌క్షించుకోవ‌టానికి అత‌ను నియ‌మాల‌ను దాటాల్సి వ‌స్తుంది. రానా త‌న కుటుంబం విష‌యంలో ఏదైనా జరిగితే అస్స‌లు ఊరుకోడు. ఈసారి క‌థ‌నం మ‌రింత ఆస‌క్తిక‌రంగా, యాక్ష‌న్‌తో క‌లగలిపి ఉంటుంది. అలాగే అర్జున్ రాంపాల్‌ను కూడా ఈ టీమ్‌లోకి స్వాగ‌తిస్తున్నాం. రానా ద‌గ్గుబాటి, వెంక‌టేష్ ద‌గ్గుబాటి త‌మ‌దైన హాస్యాన్ని, హైద‌రాబాద్ శైలిని ఈ సీజ‌న్లోకి తీసుకొచ్చారు. ఇన్‌టెన్స్ స‌న్నివేశాల్లో రానా త‌న‌దైన పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకుంటారు. సుంద‌ర్ అరోన్‌, క‌ర‌ణ్ అన్షుమ‌న్‌, సుప‌ర్ణ్ వ‌ర్మ‌, అభ‌య్ చోప్రాల‌తో క‌లిసి రానానాయుడు సీజ‌న్‌2ను ప్రేక్ష‌కుల ముందుకు జూన్‌13న తీసుకురావ‌టానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు.

క‌ర‌ణ్ అన్షుమ‌న్ మాట్లాడుతూ ‘‘రానా నాయుడు సీజన్2, సీజన్1 కంటే పెద్ద‌ది. ఇన్‌టెన్స్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. ఎమోష‌న్స్ ఇంకా ఎక్కువ‌గా ఉంటాయి. రానా, నాగ ఇంకా త‌ల‌ప‌డుతూనే ఉంటారు. వీరిద్ద‌రూ త‌న గ‌తంతో, అందులో చేసిన త‌ప్పుల కార‌ణంగా ఇబ్బందులు ప‌డి ధృడంగా మారిన‌వారు. ఈసారి నాయుడు కుటుంబంలోని డ్రామా స‌రికొత్త‌గా ఉండ‌నుంది. కోపాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. విశ్వాసాలు క‌నుమ‌రుగ‌వుతాయి. ప్రేమ‌, కుట్ర అనే రెండు అంశాల మ‌ధ్య ఉండే స‌న్న‌ని గీత క‌నిపించ‌కుండా పోనుంది. ప‌రిస్థితులు ఇప్ప‌టికే గంద‌ర‌గోళంగా ఉన్నాయ‌నుకుంటే అర్జున్ రాంపాల్ రాక‌తో ఇవి ఇంకా క‌ఠినంగా మారుతాయి. అన్నీ త‌ల‌కింద్రుల‌వుతాయి. అయితే రానా నాయుడు దృష్టంతా ఒక విష‌యంపైనే కేంద్రీకృత‌మై ఉంటుంది. ఏదైమైనా త‌న కుటుంబాన్ని కాపాడుకోవాల‌నేదే అత‌ని ల‌క్ష్యంగా ఉంటుంది’’ అన్నారు.

నిర్మాత సుంద‌ర్ అరోన్ మాట్లాడుతూ ‘‘రానా నాయుడు వంటి గమ్మత్తైన, హై ఓల్టేజ్ ప్ర‌పంచంలోకి మ‌ళ్లీ రావ‌టం అనేది ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. సీజ‌న్‌1కు వ‌చ్చిన అద్భుత‌మైన స్పంద‌న ప్ర‌తీ కోణంలో సీజ‌న్‌2కి శ‌క్తినిచ్చింది. ఈ సీజ‌న్‌లో గుండె బ‌రువెక్కే భావోద్వేగాల‌తో పాటు, ఎన్నో మ‌లుపులు తిరిగే డ్రామా కూడా ఉంటుంది. ఇవ‌న్నీ బాంబ్‌లాగా, ముట్టుకుంటే పేలిపోయేలాంటి క‌థ‌నంతో సీజ‌న్‌2 ఉంటుంది. గొప్ప న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు క‌ల‌యిక‌తో సీజ‌న్‌2ను ప్రేక్ష‌కుల‌ను అందించ‌టం ఎంతో గ‌ర్వంగా ఉంది. ఎంతో తీవ్రంగా ఉంటుందో, అంతే భావోద్వేంగానూ ఈసీజ‌న్ ఉంటుంది’’ అన్నారు.

క‌ర‌ణ్ అన్షుమ‌న్ క్రియేట్ చేసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు సుప‌ర్ణ్ వ‌ర్మ‌, అభ‌య్ చోప్రాల‌తో క‌లిసి తెర‌కెక్కించారు. సుంద‌ర్ అరోన్‌, లోకో మోటివ్ గ్లోబ‌ల్ నిర్మాణంలో రూపొందింది. సీజ‌న్‌1 ఎలాగైతే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందో, అదే విధంగా రానా నాయుడు సీజ‌న్‌2 డ‌బుల్ డ్రామా, డ‌బుల్ ఎమోషన్స్‌, ఇన్‌టెన్స్ స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుల‌ను మ‌రింత లోతుగా ఆలోచింప చేస్తాయి.

  • జూన్‌13న రానా నాయుడు సీజ‌న్‌2 స్ట్రీమింగ్ కేవ‌లం నెట్‌ఫ్లిక్స్‌లో మాత్ర‌మే

నెట్‌ఫ్లిక్స్ గురించి…

నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలోని అగ్రశ్రేణి వినోద ప్లాట్‌ఫార్మ్స్‌లో ఒకటి. ఇది 190 కంటే ఎక్కువ దేశాల్లో 300 మిలియన్లకుపైగా చెల్లింపు సభ్యత్వాలను క‌లిగి ఉంది. స‌బ్‌స్క్రైబ‌ర్స్ వివిధ భాషల్లో రూపొందిన టీవీ సిరీస్‌లు, సినిమాలు, గేమ్స్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీక్షకులు తమకు నచ్చినట్లు చూసేందుకు, మధ్యలో ఆపేందుకు లేదా మళ్లీ కొనసాగించేందుకు కావాల్సినంత స్వేచ్చ ఉంది. అంతే కాకుండా వారు ఎప్పుడైనా, ఎక్కడైనా తమ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ ప్లాన్‌ను ఎప్పుడైనా సులభంగా మార్చుకోవచ్చు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News