ఈ నెల 13వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తున్న ‘డార్లింగ్’

Must Read

ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “డార్లింగ్” ఇటీవలే థియేటర్స్ లో సందడి చేసింది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు వినోదాన్ని అందించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ నెల 13వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “డార్లింగ్” స్ట్రీమింగ్ కు రాబోతోంది.

ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య “డార్లింగ్” సినిమాను నిర్మించారు. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న భార్యతో భర్త పడే ఇబ్బందులను హిలేరియస్ గా చూపిస్తూ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసిందీ సినిమా. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “డార్లింగ్” మూవీ ప్రేక్షకులకు మరింతగా రీచ్ కానుంది.

Latest News

TFJA ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్ & శంకర్ ఐ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత ‘ఐ స్క్రీనింగ్’ పరీక్షలకు విశేష స్పందన

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో శనివారం (ఏప్రిల్ 26 న) ఫీనిక్స్ ఫౌండేషన్ & శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం...

More News