తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నానే వరువెన్’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ‘నానే వరువెన్’ నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి.
ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది.
“నేనే వస్తున్నా” పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది.
తాజాగా ఈ చిత్రం నుండి “వీరా సూర ధీర రారా” పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాటను చంద్రబోస్ రచించారు.
“వీరా సూర ధీర రారా
మతి బెదర
గతి చెదర
అడవంతా నీ అధికారం ఔరా”
లాంటి లైన్స్ ధనుష్ కి ఎలివేషన్ తో పాటు ఆకట్టుకుంటున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను రాహుల్ నంబియార్ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై “కలైపులి ఎస్ థాను” నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లుఅరవింద్ విడుదల చేస్తున్నారు.
నటీనటులు:
ధనుష్, ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు మరియు యోగిబాబు
సాంగ్ క్రెడిట్స్:
రచన: చంద్రబోస్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సింగర్: రాహుల్ నంబియార్
టెక్నికల్ టీమ్:
కథ: సెల్వరాఘవన్, ధనుష్
దర్శకుడు: సెల్వ రాఘవన్
బ్యానర్: వి క్రియేషన్స్
నిర్మాత: కలై పులి ఎస్ థాను
సమర్పణ: గీతా ఆర్ట్స్
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
PRO: ఏలూరుశ్రీను , మేఘశ్యామ్
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…