Categories: న్యూస్

వర్సటైల్ స్టార్ సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్‌లో యూవి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న చిత్రం నుంచి మోష‌న్ పోస్టర్ విడుద‌ల‌

విలక్షణ పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వర్సటైల్ స్టార్ సూర్య.. మాస్ కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగిన శివ కాంబినేషన్‌లో నూతన చిత్రం ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదటి నుంచి కమర్షియల్ తో పాటు వినూత్నమైన కథలను ఎన్నుకుంటూ.. మిర్చి, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, బాగమతి లాంటి ఎన్నో విజయాలతో అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచింది యూవీ క్రియేషన్స్.

సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో బాలీవుడ్ లో కూడా యూవీ క్రియేషన్స్ సత్తా చూపించింది. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో సూర్య, అగ్ర దర్శకుడు శివ కాంబినేషన్‌లో స్టార్ హీరో సూర్య న‌టించిన 42వ సినిమాగా స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ నెం 25గా యువి క్రియేషన్స్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ తాజాగా విడుద‌లైంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా స్థాయికి ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో ఈ మోష‌న్ పోస్ట‌ర్ ని రెడీ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు:

సూర్య తదితరులు

టెక్నికల్ టీమ్:

దర్శకుడు: శివ
బ్యానర్స్: స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్  జ్ఞానవేల్ రాజా, విక్రమ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

Tfja Team

Recent Posts

శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన…

3 hours ago

సబ్ స్క్రైబర్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఆహా ఓటీటీ

తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…

3 hours ago

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం నుంచి ‘పయనమే’ అంటూ సాగే మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…

4 hours ago

ఎన్‌టీఆర్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

ప్రముఖ‌ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్‌.టి.ఆర్‌) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ క‌ల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…

7 hours ago

‘శబార’ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది.. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ఈవెంట్‌లో హీరో దీక్షిత్ శెట్టి

దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…

10 hours ago

‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…

11 hours ago