హైదరాబాద్, సెప్టెంబర్ 7, 2022: అద్భుతమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోలతో మరియు స్పెషల్ ఈవెంట్స్, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ తో ‘జీ తెలుగు’ ఇరు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఐతే, 2022లో అత్యధిక కలెక్షన్లు సాధించిన కేజిఎఫ్-చాప్టర్ 2 యొక్క వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో ఇటీవలే టీవీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ ప్రముఖ ఛానల్, ఇప్పుడు మరో అద్భుతమైన దృశ్యకావ్యాన్ని వారి ముందుకు తేనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ‘RRR’ చిత్రాన్ని సెప్టెంబర్ 11న (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు హిందీ భాషలో ప్రసారం చేయనుంది. అంతేకాకుండా, మీ వారాంతానికి రెట్టింపు ఆనందాన్ని జోడిస్తూ ‘జీ సూపర్ ఫ్యామిలీ గ్రాండ్ ఫినాలే’ ఎపిసోడ్ని మధ్యాహ్నం 12 గంటలకు మరియు మహేష్ బాబు-సితార కలిసి పాల్గొన్న డాన్స్ ఇండియా డాన్స్-తెలుగు షో యొక్క మరో ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనుంది మీ ‘జీ తెలుగు’.
ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’ చిత్రం, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ‘భీం మరియు అల్లూరి సీతారామరాజు’ పాత్రలలో అద్భుతమైన నటన కనబరచగా, అజయ్ దేవగన్ (వెంకట రామరాజు), అలియా భట్ (సీత), మరియు ఒలీవియా మోరిస్ (జెన్నిఫర్) తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఈ కథలోని మలుపులు, ఎమోషనల్ డ్రామా, మరియు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని కలుగజేయనున్నాయి.
‘RRR’ ప్రసారానికి కొన్ని గంటల ముందు ‘జీ సూపర్ ఫ్యామిలీ’ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో ముత్యమంత ముద్దు, గుండమ్మ కథ, కల్యాణ వైభోగం, మరియు అగ్నిపరీక్ష కు చెందిన టీమ్స్ పోటీపడనున్నాయి. వీరిలో ఎవరు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి టైటిల్ ని నెగ్గుతారో తెలియాలంటే మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమాన్ని తప్పక వీక్షించాల్సిందే! కేవలం ఆటలే కాకుండా, ఆమని మరియు స్నిగ్ద యొక్క సింగింగ్ యాక్ట్స్ ఈ ఎపిసోడ్ కే హైలైట్ గా నిలవనున్నాయి. ఇక, మీ వారాంతానికి బ్లాక్బస్టర్ ముగింపు పలకడానికి డాన్స్ ఇండియా డాన్స్-తెలుగు మరో కొత్త ఎపిసోడ్ తో రాత్రి 9 గంటలకు మీ ముందుకు రానుంది. గతవారంలాగే, ఈ వారం కూడా షో లో మహేష్-సితారల సందడి అందరిని ఆకట్టుకోనుంది.
సెప్టెంబర్ 11న (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ‘జీ సూపర్ ఫ్యామిలీ’ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని, సాయంత్రం 5:30 గంటలకు ‘RRR’ హిందీ ప్రసారాన్ని, మరియు రాత్రి 9 గంటలకు డాన్స్ ఇండియా డాన్స్-తెలుగు షోని తప్పక వీక్షించండి, మీ ‘జీ తెలుగు’ లో
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…
ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…