మొ’జీ తెలుగు’ డాన్స్ ఇండియా డాన్స్ లో సందడి చేయనున్న తండ్రి-కూతుర్ల జంట

Must Read


ఎన్నో అద్భుతమైన రియాలిటీ షోస్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న జీ తెలుగు, ఇటీవలే డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు మొదటి సీసన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు బ్లాక్ బస్టర్ లాంచ్ ఎపిసోడ్స్ ద్వారా 10 కంటెస్టెంట్ జోడీలను వీక్షకులకు పరిచయం చేసిన ఛానల్, ఇప్పుడు కాంపిటీషన్ ఫేస్ ను మునుపెన్నడూలేని విధంగా ప్రారంభించనుంది. సూపర్స్టార్ మహేష్ బాబు కాంపిటీషన్ ఫేస్ ను ‘ఫ్లాగ్ ఆఫ్’ చేయబోతుండగా, తన కూతురు సితారతో కలిసి మొదటిసారి ఒక రియాలిటీ షో లో కనిపించనున్నారు. కంటెస్టెంట్స్ యొక్క మైమరపించే ప్రదర్శనలతో పాటు మహేష్-సితారలు యాంకర్స్ మరియు జడ్జెస్ తో చేసే సందడి చూడాలంటే, సెప్టెంబర్ 4న (ఆదివారం) రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే డాన్స్ ఇండియా డాన్స్ ఎపిసోడ్ ని చూడాల్సిందే.


మహేష్ బాబు తనదైన కామెడీ టైమింగ్ తో అలరించబోతుండగా, సితార వాళ్ళ నాన్నతో చేసే అల్లరి ఎపిసోడ్ కే హైలైట్ గా నిలవనుంది. అంతేకాకుండా, తన ముద్దు ముద్దు మాటలతో మరియు చక్కని డాన్స్ ప్రదర్శనతో సితార ఈ వారం ‘జీ తెలుగు’ ప్రేక్షకులను కనువిందు చేయనుంది.కాంపిటీషన్ ఫేస్ ను ప్రారంభించిన అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ, “సీతారకు డాన్స్ మీద ఉన్న మక్కువ నన్ను ఈ షో కి వచ్చేలాచేసింది. అంతేకాకుండా, మొదటిసారి నా కూతురితో కలిసి ఒక టీవీ షో లో కనిపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఎప్పటికి మరిచిపోలేని ఒక స్పెషల్ మూమెంట్. ఎన్నో భాషలలో సూపర్ హిట్ గా నిలిచిన డాన్స్ ఇండియా డాన్స్ ఇప్పుడు తెలుగులో రావడం మరియు ‘జీ తెలుగు’ మారుమూల గ్రామాల నుండి టాలెంట్ ని వెలుగులోకి తేవడం అభినందనీయం. ఈ షో లో పాల్గొంటున్న ప్రతిభావంతులైన పోటీదారులందరూ ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకుంటూ తమ కళలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను. ఆదేవిందంగా, ఈ షో కి తమను ఆహ్వానించిన ‘జీ తెలుగు’ కి ప్రత్యేక ధన్యవాదాలు,” అని చెప్పారు.


సితార షో లో తన అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ..”నేను ఒక టీవీ షో స్టేజ్ పై రావడం ఇదే మొదటిసారైనప్పటికీ నాన్న నా పక్కన ఉండటం వల్ల ఎంతో సాఫీగా గడిచిపోయింది. నాకు డాన్స్ అంటే ఎంతో ఇష్టం మరియు కంటెస్టెంట్స్ యొక్క పెరఫార్మన్సెస్ నాకు ఎంతో స్ఫూర్తిని కల్పించాయి. నా మొదటి టీవీ షో ఎక్స్పీరియన్స్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. నన్ను డాన్స్ ఇండియా డాన్స్ కి తీసుకువచ్చిన నాన్నకి స్పెషల్ థాంక్స్,” అని చెప్పుకొచ్చింది.
‘జీ తెలుగు’ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు షో కి విచ్చేసినందుకు మహేష్ బాబు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ…”ఈ కాంపిటీషన్ ను మహేష్ బాబు తన కూతురితో కలిసి లాంచ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాము. ఇది తప్పకుండా ఇటీవలి కాలంలో వచ్చిన అతిపెద్ద షో లాంచ్లలో ఒకటిగా నిలిచిపోతుంది. డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు ద్వారా ‘జీ తెలుగు’ అద్భుతమైన టాలెంట్ ను వెలికితీసింది. ఇక నుండి ప్రతి వారం అద్భుతమైన ప్రదర్శనలతో ఈ షో అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాము. మహేష్ బాబు తన కూతురు సితార తో కలిసి చేసిన మొట్టమొదటి టీవీ షో ఎంట్రీ ఈ కార్యక్రమానికి ఎంతో మేలుచేయడంతో పాటు వారి అభిమానులకి కన్నుల పండుగగా నిలవనుంది,” అని చెప్పారు.


డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు ప్రసారానికి కొన్ని గంటల ముందు ‘జీ తెలుగు’ మరో అద్భుతమైన కార్యక్రమంతో ప్రేక్షుకుల ముందుకు రానుంది. ఇటీవలే బోనాలు ఈవెంట్ తో అందరిని అలరించిన ఛానల్, ఇప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ ఈవెంట్ — మన ఊరి రంగస్థలం — తో ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వీక్షకులను ఎంటర్టైన్ చేయనుంది. ఆ ఫెస్టివల్ ఈవెంట్ కి శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, నటులు సుధీర్ బాబు మరియు శ్రీ సింహ, దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మరియు సతీష్ త్రిపుర, గాయకుడు మరియు సంగీత దర్శకుడు కాల భైరవ ప్రత్యేక అతిధులుగా విచ్చేయనున్నారు. అంతేకాకుండా, ప్రముఖ టీవీ నటులు, కమెడియన్స్, సరిగమప కంటెస్టెంట్స్ తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News