సుప్రీమ్ కోర్ట్ తీర్పుని స్వాగతించిన ఇషా ఫౌండేషన్

Must Read

20th Oct 2024,ఈశా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా కొందరు వేసిన పిటీషన్ ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము ఎంతగానో స్వాగతిస్తున్నాము.

ఒక సంస్థ ప్రతిష్టను దిగజార్చడం కోసం చట్టపరంగా తమకు ఉన్న అవకాశాలను దుర్వినియోగం చేయటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టిన విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ కేసు నేపథ్యంలో కొందరు ఈశా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా, సద్గురుకు వ్యతిరేకంగా, ఆరోపణలు చేశారు. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు.

ఈశా ఫౌండేషన్ ఎప్పుడు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడదని, చట్టాలను గౌరవిస్తుందని మరోసారి తెలియజేస్తున్నాము.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా కొందరు అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారు ఈ ప్రచారం వెంటనే మానకపోతే చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము.

Latest News

శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో...

More News