తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు..వై.కాశీ విశ్వనాథ్ “ఆర్ఆర్ఆర్” సినిమాని ఆస్కార్ కి.. నామినేట్ చేయకపోవడం అన్యాయమని సినీ దర్శకుడు, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు, సినీ నటుడు..వై. కాశీ విశ్వనాథ్ అన్నారు.ఒక దేశభక్తిని చాటి చెప్పే చిత్రాలు ఎన్నో వచ్చాయి. ఫిక్షన్ యాంగిల్ లో.. కల్పిత కధతో ఎంతో కష్టపడి.. ఎన్నో సంవత్సరాలు వెచ్చించి.. అద్భుతంగా తెరకెక్కించిన సినిమా.. “ఆర్ఆర్ఆర్”. ‘కంటెంట్’ పరంగా గాని.. ‘సందేశం’ పరంగా గాని.. దేశ ఖ్యాతిని ఇనుమడింప జేసే సినిమా అని అన్నారు.
“ఆర్ఆర్ఆర్ ” చిత్రీకరణలో ‘సీన్స్’ రక్తి కట్టించడంలో గాని.. నటీనటుల నుంచి పెరఫార్మెన్స్ రాబట్టుకోవడంలో గాని.. దర్శకులు రాజమౌళి గారు ప్రాణం పెట్టి పని చేశారు. హీరోలు జూ. ఎన్టీఆర్ గారు గానీ.. రామ్ చరణ్ గాని.. పాత్రలలో జీవించారు. టెక్నీషియన్స్ ప్రతిభ అమోఘం. అలాంటి సినిమా ని ఆస్కార్ కి నామినేట్ చేయకుండా.. ” చెల్లో షో” అనే గుజరాతీ సినిమాను నామినేట్ చేయడం.. తెలుగు చిత్రాన్ని పట్టించుకోకపోవడం.. శోచనీయం. దీన్ని ఖండిస్తూ.. తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా..నా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నానని..ఆయన పేర్కొన్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…