Categories: న్యూస్

శాసనసభలో హెబ్బాపటేల్ ప్రత్యేకపాట


ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న పాన్‌ఇండియా చిత్రం శాసనసభ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో అందాలతార హెబ్బాపటేల్ ఓ ప్రత్యేక పాటలో నర్తించింది. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర బృందం ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది.

యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ ప్రత్యేకపాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రవిబసుర్ సంగీత ఈ చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. ఈ ప్రత్యేకపాటను ఆయన సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రత్యేకపాటను ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతులు అందించగా, పాపులర్ సింగర్ మంగ్లీ ఆలపించారు. ముఖ్యంగా ఈ పాట మాస్‌ను ఉర్రూతలూగిస్తుంది.త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.ఈ చిత్రానికి కథ- మాటలు: రాఘవేందర్‌రెడ్డి.

Tfja Team

Recent Posts

దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేత ‘వాలీ’ టైటిల్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ

టాలీవుడ్‌లో మొట్టమొదటి వాలీబాల్ నేపథ్యంలోని స్పోర్ట్స్ డ్రామా ‘వాలీ’ (VOLLEY) తన టైటిల్‌ను ఆసక్తికరమైన మోషన్ పోస్టర్ ద్వారా అధికారికంగా…

32 minutes ago

మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్స్- సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘జెట్లీ’ మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత…

2 days ago

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల…

2 days ago

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

3 days ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

3 days ago