ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఫ్రీ హెల్త్ క్యాంప్

Must Read

హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…
ఆదివారం నాడు హైదరాబాద్ ఫిలింనగర్ సెంటర్లో మెంబర్లకు ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సిటీ న్యూరో సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

అవసరమైన వారికి ఫ్రీ మెడికేషన్ కూడా అందించారు. ప్రముఖ న్యూరాలజిస్టులు, ఆర్థోపెడిషన్లు, పలమనాలజిస్టులు, గైనకాలజిస్ట్లు, కార్డియాలజిస్టులు, పర్మనాలజిస్టులతో పాటు డెంటల్, ఐ చెకప్స్ వంటివి కూడా నిర్వహించారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ మెంబర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ లో తమ ఆరోగ్య పరీక్షలు జరుపుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సెక్రటరీ తుమ్మల రంగారావు, కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

Latest News

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి...

More News